తెలంగాణ

telangana

కొత్త ఫ్రిజ్​ కొంటున్నారా?.. అయితే ఈ వివరాలు ఉన్నాయో లేదో చూసుకోండి!

By

Published : Oct 7, 2022, 7:06 AM IST

గృహావసరాల కోసం వాడే ఫ్రిజ్‌ల ఇంధన వినియోగానికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడించాలని కేంద్ర బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ సంస్థ పేర్కొంది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అవేంటంటే?

new rules for usage of fridge energy
fridge

గృహావసరాల కోసం వాడే ఫ్రిజ్‌ల ఇంధన వినియోగానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని కేంద్ర బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ సంస్థ పేర్కొంది. ఇందుకు నిబంధనలను విడుదల చేస్తూ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక మీదట ప్రతి ఫ్రిజ్‌పై కొన్ని వివరాలు తప్పనిసరిగా పొందుపరచాలని నిర్దేశించింది.

  • బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ లోగో
  • తయారీదారు లేదా దిగుమతిదారు పేరు
  • బ్రాండ్‌పేరు
  • దాని టైప్‌
  • మొత్తం సామర్థ్యం (వాల్యూమ్‌)
  • మోడల్‌ నంబర్‌
  • తయారీ/ దిగుమతి చేసుకున్న సంవత్సరం
  • ప్రత్యేక విశిష్ట సంఖ్య (యునిక్‌ సిరీస్‌ కోడ్‌)
  • ఏడాదికి ఎన్ని యూనిట్ల విద్యుత్తు ఖర్చు చేస్తుంది
  • స్టార్‌ లెవెల్‌
  • లేబుల్‌ పీరియడ్‌

పై వివరాలన్నీ తప్పనిసరిగా పొందుపరచాలని నిర్దేశించింది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన ఆరునెలల్లోపు ప్రతి ఫ్రిజ్‌పై ఈ వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details