తెలంగాణ

telangana

అమ్మాయి కోసం గొడవ.. సోదరులపై కత్తితో దాడి.. ఫోన్ దొంగిలించాడని యువకుడిపై దారుణం

By

Published : Sep 12, 2022, 12:56 PM IST

బాలిక విషయంలో వివాదం తలెత్తి ఇద్దరు సోదరులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణం దిల్లీలో జరిగింది. మరోవైపు, మొబైల్​ను దొంగిలించాడని 19 ఏళ్ల యువకుడిపై పాశవికంగా దాడి చేసి చంపేశారు ఫ్యాక్టరీ కార్మికులు. ఈ అమానవీయ ఘటన దిల్లీలో జరిగింది.

neighbour stabbed brothers
సోదరులపై దాడి

బాలిక విషయంలో గొడవ తలెత్తి ఇద్దరు సోదరులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ దుండగడు. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణం దిల్లీలోని సబ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది.
క్షతగాత్రులిద్దరినీ హిందూరావు ఆస్పత్రికి తరలించగా.. ప్రిన్స్(20) అనే ఓ యువకుడు మరణించాడు. అతడి సోదరుడు మిహిర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. క్షతగాత్రుడు మిహిర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

సోదరులపై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడు పేరు సిద్దార్థ్. నార్త్​ దిల్లీలోని మల్కాగంజ్​ ప్రాంతంలో నివసిస్తున్నాడు. బాధితుల ఇంటి పక్కనే నిందితుడు నివసిస్తున్నాడు. ఓ బాలిక విషయంలో కొన్ని రోజుల క్రితం నిందితుడికి, సోదరుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో అప్పటి నుంచి నిందితుడు.. బాధితులపై కక్ష పెంచుకున్నాడు.

-పోలీసులు

ఫోన్​ను దొంగిలించాడని..
మొబైల్​ను దొంగిలించాడని ఆరోపిస్తూ ఇజార్​ అనే 19 ఏళ్ల యువకుడిపై ఫ్యాక్టరీ కార్మికులు పిడిగుద్దులు కురిపించారు. అక్కడితో ఆగకుండా బెల్టులు, ప్లాస్టిక్ పైపులతో బాదారు. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రధాన నిందితుడు గ్యాని(36)ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర దిల్లీలోని సరాయ్ రోహిల్లాలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఇజార్(19) అనే యువకుడు ఫ్యాక్టరీలోకి ప్రవేశించి మొబైల్​ను దొంగతనం చేస్తుండగా గ్యాని అనే కార్మికుడు అతడిని పట్టుకున్నాడు. బాధితుడిని పట్టుకుని.. ఇతర కార్మికులతో కలిసి గ్యాని తీవ్రంగా కొట్టాడు. అక్కడితో ఆగకుండా యువకుడి జుట్టును సైతం కత్తిరించాడు.
అషాజాదాబాగ్‌లో రోడ్డుపై మృతదేహం పడి ఉన్నట్లు సరాయ్ రోహిల్లా పోలీసులకు సమాచారం అందింది. స్థానిక సీసీటీవీ పుటేజ్​ను పోలీసులు పరిశీలించగా.. శనివారం వేకువజామున 4 గంటల సమయంలో బాధితుడిపై దాడి జరిగినట్లు తేలింది. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:దేశవ్యాప్తంగా 60 ప్రదేశాల్లో ఎన్‌ఐఏ దాడులు.. ఆ గ్యాంగ్​స్టర్లే టార్గెట్!

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. ఏడుగురు మృతి.. 12 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details