తెలంగాణ

telangana

'శివసేన సర్కార్​ను అవమానించేందుకే.. వాజే అరెస్టు'

By

Published : Mar 17, 2021, 10:13 AM IST

అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్ధాల కేసులో పోలీసు అధికారి సచిన్​ వాజేను అరెస్టు చేసిన తీరు సరైనది కాదని ఆరోపించారు మహారాష్ట్రలోని కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు.

NCP and Cong leaders meet CM Thackeray over Waze affair
'వాజే అరెస్టు శివసేనకు అవమానమే'

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో నిందితుడు, పోలీసు అధికారి సచిన్ వాజేను అరెస్టు చేసిన విధానం సరైనది కాదని మహారాష్ట్రలోని కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నేతలు ఆరోపించారు. వాజేను అరెస్టు చేయడం అధికార శివసేన కూటమిని అవమానించడమని అన్నారు. ఈ మేరకు మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు.

పేలుడు పదార్థాలు ఉన్న వాహనానికి సంబంధించిన యజమాని మన్​సుఖ్ హిరేన్ మృతి నేపథ్యంలో ఎన్​ఐఏ శనివారం వాజేను అరెస్టుచేసింది. హిరేన్​ భార్య కూడా తన భర్త మరణానికి కారణం వాజే అని ఆరోపించారు.

అయితే, వాజే.. శివసేన అభ్యర్థి అంటూ భాజపా చేసిన అరోపణలను తిప్పికొట్టారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. 2008లోనే పార్టీలో ఆయన సభ్యత్వం తొలగించినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details