తెలంగాణ

telangana

సామాన్యుడి 'స్వచ్ఛ' సంకల్పం.. కారునే చెత్త వాహనంగా మార్చి..

By

Published : Apr 4, 2022, 6:40 PM IST

Haridwar Man Swachabharat Car: అతడు ఓ సామాన్య వ్యక్తి. పట్టణంలో ఉన్న సమస్యలపై ప్రజలకు తరచూ అవగాహన కల్పిస్తుంటాడు. ఇక, పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్న చెత్త సేకరణ సమస్యకు పుల్​స్టాప్​ పెట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన కారునే చెత్త వాహనంగా మలిచి కొన్నేళ్లుగా రోజూ చెత్త సేకరిస్తున్నాడు. అతడే హరిద్వార పట్టణానికి చెందిన నరేశ్​ గిరి.

్

సామాన్య వ్యక్తి .. కారుతోనే స్వచ్ఛభారత్​!

Haridwar Man Swachabharat Car: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా హరిద్వార్​కు చెందిన ఓ వ్యక్తి వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం చూసి తన వంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. తన కారునే చెత్తను తరలించే వాహనంగా మలిచి కొన్ని సంవత్సరాలుగా చెత్తను సేకరిస్తున్నాడు.

నరేశ్​ గిరి

2012లో హరిద్వార్​ పట్టణంలో.. వ్యర్థాల సేకరణ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల చెత్త విపరీతంగా పేరుకుపోయేది. ఆ పరిస్థితులను గమనించిన 53 ఏళ్ల నరేశ్ గిరి.. పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి ఏదైనా చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న మారుతీ-800 కారునే ఇందుకోసం ఉపయోగించాలనుకున్నాడు. కారులో వెనుక ఉండే రెండు సీట్లను తీసేశాడు. ఓ ప్లాస్టిక్​ డ్రమ్మును సగానికి కట్​ చేసి.. కారు సీట్ల స్థానంలో అమర్చాడు. కారుపైన జాతిపిత మహాత్మాగాంధీ, ప్రధాని మోదీ ఫొటోలను కూడా పెట్టుకున్నాడు. ప్రతిరోజూ పట్టణమంతా తిరిగి చెత్త సేకరిస్తున్నాడు నరేశ్. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయడం పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.

కారుతో నరేశ్​

ఎలాంటి గుర్తింపు, పారితోషికాలు కోరుకోని నరేశ్​.. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించడమే తన ధ్యేయమని అంటున్నాడు. ."నాకు ఎలాంటి ఆర్థిక సహాయం లేదా అవార్డులు అవసరం లేదు. ఎవరైనా నాకు సహాయం చేయాలనుకుంటే, నిర్దేశించిన ప్రదేశంలో చెత్తను వేయండి చాలు. అదే నాకు మీరు చేసిన అతి పెద్ద సహాయం" అని నరేశ్​ చెబుతున్నాడు. ఎలాంటి ప్రతిఫలం కోరుకోకుండా ఈ పనిచేస్తున్న నరేశ్​ను.. హరిద్వార్ మేయర్ అనితా శర్మ అభినందించారు. త్వరలోనే అతడిని సన్మానిస్తామని తెలిపారు.

చెత్త సేకరిస్తున్న నరేశ్​

ఇదీ చదవండి: విమానాల్లో వచ్చి గొలుసులు చోరీ.. అంతా భార్య కోసమే!

ABOUT THE AUTHOR

...view details