తెలంగాణ

telangana

రేవంత్ రెడ్డికి లోకేశ్ అభినందనలు - ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన కొనసాగించాలంటూ

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 3:27 PM IST

Nara Lokesh wishes Telangana New CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి తెలుగుదేశం అధినేత నారా లోకేశ్​తో పాటుగా కొణిదెల చిరంజీవి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగించాలంటూ లోకేశ్ సూచనలు చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.

Nara Lokesh wishes Telangana New CM Revanth Reddy
Nara Lokesh wishes Telangana New CM Revanth Reddy

Nara Lokesh wishes Telangana New CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి పలువురు నేతలు ట్విట్టర్​ (ఎక్స్) ద్వార్ అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగించాలంటూ సూచనలు చేశారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి తన బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించాలని లోకేశ్ ఆకాంక్షించారు.

మెగాస్టార్ చిరంజీవి అభినందనలు: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డితో పాటుగా ప్రమాణస్వీకారం చేసిన ఉపముఖ్యమంత్రి, మంత్రులకు సైతం చిరు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగించాలంటూ పేర్కొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా రేవంత్ అభిమానులు: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా వీరులపాడులో రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ నాయకులు, సానుభూతిపరులు అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వీర్లుపాడు తెలుగుదేశం పార్టీ అభిమానుల పేరిటశుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫోటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణం - ఆరు గ్యారంటీల దస్త్రంపై తొలి సంతకం

పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగాసీఎల్పీ నేత ఎనుముల రేవంత్​ రెడ్డి ప్రమాణ స్వీకారంచేశారు. హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో అతిరథ మహారథుల సమక్షంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్​ రెడ్డి, పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ. త్యాగాలే పునాదులుగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. పదేళ్లుగా నిరంకుశత్వాన్ని ప్రజలు మౌనంగా భరించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఇవాళ స్వేచ్ఛ వచ్చిందని, ఇప్పటికే ప్రగతిభవన్‌ ఇనుప కంచెలను బద్ధలు కొట్టించామని వెల్లడించారు. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలన్నా ప్రజాభవన్‌కు రావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు అని పేర్కొన్నారు. సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబు శిష్యుడు రేవంత్​రెడ్డి' - తెలంగాణ ముఖ్యమంత్రికి శుభాకాంక్షల వెల్లువ

ABOUT THE AUTHOR

...view details