తెలంగాణ

telangana

'మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు'.. దిల్లీ మహిళా చీఫ్ సంచలన వ్యాఖ్యలు

By

Published : Mar 11, 2023, 6:32 PM IST

Swati maliwal
Swati maliwal

తన చిన్నతనంలో తండ్రి తనను లైంగిక వేధింపులకు గురి చేసేవాడని చెప్పారు దిల్లీ మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​ స్వాతి మాలివాల్. శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిల్లీ మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​ స్వాతి మాలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. చిన్నతనంలోనే తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలిపారు. తన చిన్నతనంలో తండ్రి తనను లైంగికంగా వేధింపులకు గురి చేసేవాడని చెప్పారు.

"మా నాన్న తరచూ నన్ను లైంగికంగా వేధించేవాడు. ఆయన ఇంట్లోకి వస్తేనే నేను భయపడేవాడిని. నాకు ఇంకా గుర్తు.. ఆయనకు భయపడుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అలాంటి వాళ్లకు నేను ఏం చేయాలో అప్పుడే ఆలోచించాను. ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. ఏ కారణం లేకుండానే నన్ను కొట్టేవాడు. ఒకసారి నా జుట్టు పట్టుకుని గోడకు కొట్టాడు. మా అమ్మ, అత్తమామలు, తాతయ్య లేకుంటే నేను ఇలా ఉండేదానిని కాదు. ఎవరినైనా హింసించినప్పుడు.. ఆ వ్యక్తిలో అగ్ని వెలుగుతోంది. దానిని సరైన మార్గంలో పెడితే ఏదైనా సాధించగలరు."

--స్వాతి మాలివాల్​, దిల్లీ మహిళా కమిషన్

జపాన్​కు చెందిన యువతిపై హోలీ సందర్భంగా రంగులు పూసి అనుచితంగా వ్యవహరించిన ఘటనపైనా స్పందించారు స్వాతి." ఇంటర్నెట్​లో వైరల్ అయిన జపాన్​ మహిళ వీడియోను చూశాను. ఆమె చాలా వేధింపులకు గురైంది. సహాయం కోసం అడిగింది. అయినా వారు ఆపలేదు. దీనిపై దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తున్నాం. నిందితులను గుర్తించి జైలులో పెట్టాలి." అని ఆమె చెప్పారు.

అంతకుముందు కూడా దిల్లీ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ స్వాతి మాలివాల్​పై వేధింపులు జరిగాయి. ఇటీవలే ఓ పోకిరి.. ఆమెను 10, 15 మీటర్ల దూరం వరకు కారుతో ఈడ్చుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న ఓ కారు డ్రైవర్​ ఆమె​ను వేధింపులకు గురిచేసి, అసభ్యంగా ప్రవర్తించాడు. దిల్లీలో మహిళల భద్రతను పరిశీలించేందుకు అర్ధరాత్రి బయటకు వెళ్లిన నేపథ్యంలోనే స్వాతి మాలివాల్​పై.. ఈ దారుణం జరిగింది. దేశ రాజధానిలో మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​కే రక్షణ లేకపోవడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని హరీశ్​ చంద్ర(47)ను అదుపులోకి తీసుకున్నారు.

నటి ఖుష్బూ నాన్న సైతం..
ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన నటి ఖుష్బూ సుందర్.. కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఖుష్బూ పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి నుంచే లైంగిక వేధింపులు రావడం దారుణమని అన్నారు. 15 ఏళ్ల వయసు వచ్చాక అతడిని ఎదిరించడం మొదలుపెట్టినట్లు చెప్పారు. 16 ఏళ్ల వయసులోనే కుటుంబాన్ని వదిలిపెట్టి తన తండ్రి వెళ్లిపోయినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details