తెలంగాణ

telangana

'ఛఠ్​​పూజ'లో ముస్లిం మహిళల పొయ్యిలే ప్రత్యేకం

By

Published : Nov 18, 2020, 12:52 PM IST

Updated : Nov 18, 2020, 1:44 PM IST

Muslim women make clay stoves for the Chchath Pooja in Patna

బిహార్​లోని ప్రసిద్ధ హిందూ పండుగ 'ఛఠ్​​ పూజ'లో మత సామరస్యం వెల్లివిరుస్తుంది. ఈ పూజలో వినియోగించే ప్రత్యేకమైన మట్టిపొయ్యిలను ముస్లిం మహిళలు తయారు చేసి విక్రయించడం ఆనవాయితీగా వస్తోంది.

'ఛఠ్​​పూజ'లో ముస్లిం మహిళల పొయ్యిలే ప్రత్యేకం

ఛఠ్​ పూజ​... ప్రసిద్ధ హిందూ పండుగల్లో ఒకటి. దీనిని బిహార్ సహా ఉత్తర ​భారతదేశంలో పలు రాష్ట్రాల్లో వైభవంగా జరుపుకుంటారు. ఈ పూజలో భాగంగా మట్టిపొయ్యి మీద కుండల్లో వండిన పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెడతారు. పూజలో మట్టి పొయ్యి, కుండ చాలా ముఖ్యం. అయితే అటువంటి మట్టి పొయ్యిలను స్థానికంగా ఉండే ముస్లిం మహిళలు తయారు చేస్తూ మతసామరస్యాన్ని చాటుతున్నారు.

'ఛఠ్​ పూజ' కోసం సిద్ధం చేస్తున్నపొయ్యిలు
పొయ్యిల తయారీలో నిమగ్నమైన మహిళ
పొయ్యి తయారు చేస్తున్న ముస్లిం మహిళ

తగ్గిన అమ్మకాలు

దశాబ్దాలుగా పండుగ వేళలో.. ముస్లిం మహిళలు మట్టిపొయ్యిలను తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా కారణంగా ఈసారి అమ్మకాలు తగ్గిపోయాయి. ఫలితంగా తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు.

మట్టిపోయ్యిలు అమ్ముతున్న మహిళ

ఇదీ చూడండి:ఉత్తర భారతంలో వైభవంగా 'ఛఠ్​ పూజ'

Last Updated :Nov 18, 2020, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details