తెలంగాణ

telangana

పాక్ యువకుడితో ప్రేమ.. దేశం దాటి వెళ్లేందుకు యత్నం.. అధికారులు అడ్డుపడి..

By

Published : Jun 25, 2022, 6:11 PM IST

MP girl eloping for Pakistan: పాకిస్థాన్ యువకుడితో ప్రేమలో పడి.. అతడి కోసం దేశం దాటి వెళ్లేందుకు యత్నించింది ఓ యువతి. మధ్యప్రదేశ్​కు చెందిన ఆమెకు ఫేస్​బుక్​లో యువకుడు పరిచయమయ్యాడు. అతడి కోసమే పాకిస్థాన్ వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమైంది.

Girl tries to flee to her lover in Pakistan
Girl tries to flee to her lover in Pakistan

Madhya Pradesh girl going Pakistan: మధ్యప్రదేశ్​కు చెందిన ఓ యువతి పాకిస్థాన్ యువకుడితో ప్రేమలో పడి.. అట్టారీ వాఘా సరిహద్దు ద్వారా దేశం దాటేందుకు ప్రయత్నించింది. పాస్​పోర్ట్, ధ్రువపత్రాలన్నింటినీ వెంటబెట్టుకొని సరిహద్దుకు వెళ్లిన ఆమెను కస్టమ్స్ అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని పంజాబ్ అమృత్​సర్​లోని ఘరిండా పోలీస్ స్టేషన్​కు తరలించారు.

దేశం దాటి వెళ్లేందుకు యత్నించిన యువతి

ఆమెను ఫిఝా ఖాన్​గా గుర్తించారు. ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోగానే.. మధ్యప్రదేశ్​లోని రేవా పట్టణంలో ఉండే కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అన్ని ధ్రువపత్రాలు తీసుకొని వెళ్లిపోయిందని పోలీసులకు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు జరపగా యువతి పాకిస్థాన్​కు వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు అధికారులతో సమాచారం పంచుకున్నారు. పంజాబ్ పోలీసులు ఆమెను.. జిల్లా సబ్​డివిజనల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి.. కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చర్యలు తీసుకున్నారు.

'పాకిస్థాన్​కు చెందిన యువకుడు దిల్షద్ ఖాన్​తో యువతి ప్రేమలో పడింది. ఫేస్​బుక్ ద్వారా వీరిద్దరికీ పరిచయం అయింది. ప్రైవేట్ స్కూల్​లో టీచర్​గా పనిచేస్తున్న ఆమె.. ఆ యువకుడి కోసమే పాకిస్థాన్ వెళ్లాలని అనుకుంది. యువతిని ఇప్పుడు మధ్యప్రదేశ్ పోలీసులకు అప్పగించాం' అని అమృత్​సర్ సబ్​డివిజనల్ మేజిస్ట్రేట్ హర్​ప్రీత్ సింగ్ తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details