తెలంగాణ

telangana

కుమారుడితో కలిసి టెన్త్​ పరీక్షలకు తల్లి.. 'ఇలా జరగడం ఇదే మొదటిసారి'

By

Published : Mar 3, 2023, 9:28 AM IST

కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ మహిళ చదువుకోలేదు. ఆ తర్వాత పెరిగిన బాధ్యతలు ఆమెను పూర్తిగా చదువుకు దూరం చేశాయి. ఆమె సంకల్ప బలమో ఏమో కానీ ప్రస్తుతం ఆమె తన కుమారుడితో కలిసి పదో తరగతి బోర్టు పరీక్షలకు హాజరవుతోంది. కచ్చితంగా ఆ పరీక్షల్లో ఉత్తీర్ణురాలిని అవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ మహిళ ఎవరో.. ఆమె కథంటే తెలుసుకుందాం.

mother sond uo take 10th exam together
mother sond uo take 10th exam together

కుటంబ పరిస్థితుల దృష్ట్యా చదువుకు దూరమైంది ఓ మహిళ. పెళ్లి, పిల్లలు, బాధ్యతలు ఆమెను చదువుకు ఇంకా దూరం చేశాయి. సంకల్ప బలమో ఏమో కానీ.. ఆమె కల ఇప్పుడు నెరవేరబోతోంది. కుమార్తె ఇచ్చిన ప్రోత్సాహంతో తన కుమారుడితో కలిసి పదో తరగతి పరీక్షలకు హాజరవుతోంది. కచ్చితంగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణురాలని అవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు.. ఈ వయసులో ఎందుకు చదవాలనుకుంటుందో తెలుసుకుందాం..

బంగాల్​కు చెందిన ఆయేషా బేగం.. తూర్పు బుర్​ద్వాన్​ జిల్లా శక్తిగఢ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఘట్​శిలా అనే గ్రామంలో నివసిస్తోంది. ఆమె భర్త వ్యవసాయం చేస్తుండగా.. ఆయేషా ఐసీడీఎస్ ​(ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్)లో పనిచేస్తోంది. వీరికి ఫిర్దౌసి, పర్వేజ్​ ఆలం అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, ఆయేషాకు చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి ఉండేది. కానీ, కుటుంబ పరిస్థితులు, వివాహం, పిల్లలు తదితర కారణాల వల్ల చదువుకోలేకపోయింది. పిల్లలు పెద్దవారయ్యాక కూడా చదువుకునేందుకు వీలు పడలేదు. అయితే, తాను చదువుకోలేక పోయినా.. తన పిల్లలు ఉన్నతవిద్య అభ్యసించాలని ఆశించింది. అనుకున్నట్టే ఇద్దరిని చదివించింది. అమ్మ ఆశయం వైపు ఆడుగులేసిన ఆయేషా కుమార్తె ఫిర్దౌసి ఎంఏ పూర్తి చేసింది. కానీ ఆయేషా బేగం కుమారుడు పర్వేజ్​కు చదువు అబ్బలేదు. దీంతో ఆరేళ్ల క్రితమే పదో తరగతి పూర్తి కాకుండానే చదువు మానేశాడు.

కుమారుడితో కలిసి చదువుతున్న ఆయేషా బేగం

కుమార్తె ప్రోత్సాహం..
అమ్మకు చదువుపై ఉన్న మక్కువను గ్రహించిన కుమార్తె ఫిర్దౌసి.. ఆయేషాను చదువుకోమని ప్రోత్సహించేంది. అమ్మతో పాటు తమ్ముడిని కూడా మళ్లీ చదువువైపు మళ్లించింది. అందులో భాగంగానే తల్లీకుమారుడికి మేమారి హై మదర్సాలో సీటు లభించింది. ప్రస్తుతం వీరిద్దరు పదో తరగతి బోర్డు పరీక్షలకు హాజరవుతున్నారు. కాగా, ఈ వయసులో ఆయేషా బేగం పరీక్షలకు హాజరు కావడం.. చదువు మానేసిన పర్వేజ్​ మళ్లీ పరీక్షలు రాస్తుండడం వల్ల టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆయేషా బేగం

"నేను చదువుకోలేదు. నా కుమార్తె చదువుకుంది. 'నువ్వు కూడా చదువుకుంటే నీ పనిలో ఉపయోగపడుతుంది' అని నాకు చెప్పింది. అందుకే నేను మదర్సాలో పేరు నమోదు చేయించుకున్నాను. నా కుమారుడితో కలిసి పదో తరగతి పరీక్షలకు ప్రిపేర్​ అయ్యాను. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు బాగా రాస్తున్నాను. నాలా వివిధ కారణాల వల్ల చదువు మానేసిన వారు తిరిగి చదువు మొదలు పెట్టండి."

--ఆయోషా బేగం, తల్లి

ఈమెను చూసి స్ఫూర్తి పొందాలి..
ఈ తల్లీకుమారుడు పరీక్షలు రాయడం చూసిన మెమారి హై మదర్సా ప్రధానోపాధ్యాయుడు తురత్​ అలీ వారిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.."ఈ మెమారీ హై మదర్సాలో ఎంతో కాలంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఎప్పుడూ.. ఇలా తల్లీకుమారులు కలిసి పరీక్షలు రాయలేదు. ఆ తల్లి నా సెల్యూట్​. పెళ్లి తర్వాత చదువు మానేసిన చాలా మంది మహిళలు ఈమెను చూసి స్ఫూర్తి పొందాలి. ఆయేషా బేగం ఇంకా పై చదువులు చదవాలనుకుంటే... అమెకు అన్ని విధాలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. " అని తురత్​ అలీ అన్నాడు.

ABOUT THE AUTHOR

...view details