తెలంగాణ

telangana

వివాహేతర బంధంతో ఏటా ఒకరిని కనడం.. కిరాతకంగా చంపడం.. చివరకు...

By

Published : Apr 8, 2022, 1:34 PM IST

mother killed daughters: వివాహేతర సంబంధం ఇద్దరు పసికందుల ప్రాణాలను తీసింది. కన్న కుమార్తెలనే హత్యచేసింది ఓ తల్లి. ఒకరి మృతదేహాన్ని చెరువులో పడేసింది. మరొకరిని పూడ్చి పెట్టింది. నాలుగేళ్ల క్రితం తమిళనాడులో జరిగిన ఈ హత్యలు అప్పట్లో పెనుదుమారం రేపగా.. ఇప్పుడు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

The mother who killed her own children
కన్నకూతుర్లనే హతమార్చిన తల్లి

mother killed daughters: విహహేతర సంబంధం అభంశుభం తెలియని ఇద్దరు పసిపిల్లల ప్రాణాలను తీసింది. 2018, 2019 సంవత్సరాల్లో కన్న కుమార్తెలను హత్య చేసింది ఓ మహిళ. పరాయి పురుషుడితో తన వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఈ పని చేసింది. ఈ ఘటన తమిళనాడులోని తెన్కాసి జిల్లా శంకరన్‌కోయిల్ గ్రామంలో జరిగింది.

అసలు ఏం జరిగిదంటే?:2018లో నోచికులం సమీపంలోని శంకరన్‌కోయిల్ గ్రామంలో పసికందు శవం చెరువులో కనిపించింది. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల దర్యాప్తు చేసినా ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేకపోయారు. కొన్ని సంవత్సరాలుగా ఈ కేసులో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. ఇప్పుడు ఉన్నతాధికారుల ఒత్తిడితో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుల కోసం నోచికులం, ఆ గ్రామ సమీప ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు. దీంతో అనుమానం వచ్చి వల్లరాంపురానికి చెందిన శశికుమార్, ముతుమారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దర్యాప్తులో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది.

పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధంగా:ముతుమారికి మాడసామి అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె , కుమారుడు ఉన్నారు. ఈ దంపతుల మధ్య మనస్పర్థలు రావడం వల్ల గత పదేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. ఆ తరువాత ముతుమారి తన కూతురు, కొడుకుతో కలిసి నోచికులంలో నివసిస్తోంది. ఆ సమయంలో ముతుమారికి.. వల్లరాంపురానికి చెందిన శశికుమార్​తో పరిచయం ఏర్పడి.. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. వీరికి 2018లో ఒక పాప పుట్టింది. ఈ బిడ్డ వల్ల తమ వివాహేతర బంధం బయటపడుతుందనే భయంతో ఐదు రోజుల పసికందును చెరువులో పడేశారు. ఆపై అక్కడి నుంచి పరారయ్యారు. అదే విధంగా 2019లో వీరికి మరో పాప జన్మించింది. ఈ చిన్నారిని హత్య చేసి ముతుమారి ఇంటి సమీపంలో పాతిపెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఊర్లోకి రాలేదు. మళ్లీ కొన్ని రోజుల కిందటే గ్రామానికి రాగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని పాతిపెట్టిన స్థలాన్ని పోలీసులకు నిందితులు చూపించారు. చిన్నారి మృతదేహాన్ని.. పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు.

ఇదీ చదవండి:'మరో రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చనున్న భాజపా?'

ABOUT THE AUTHOR

...view details