తెలంగాణ

telangana

Modi Speech Today In Bjp Office : 'మెజారిటీ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి.. మహిళా బిల్లే అందుకు సాక్ష్యం'

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 12:23 PM IST

Updated : Sep 22, 2023, 1:21 PM IST

Modi Speech Today In Bjp Office : మెజారిటీ ప్రభుత్వంతోనే దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా రిజర్వేషన్​ బిల్లు ధన్యవాద సభలో ఆయన మాట్లాడారు.

Modi Speech Today In Bjp Office
Modi Speech Today In Bjp Office

Modi Speech Today In Bjp Office :మహిళా రిజర్వేషన్ బిల్లు సాధారణమైంది కాదని.. నూతన ప్రజాస్వామ్య నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహిళల సంకెళ్లను తెంచేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని.. వారి సంక్షేమం, భద్రత, గౌరవానికి అనేక పథకాలు తీసుకువచ్చిందని తెలిపారు. మహిళా రిజర్వేషన్​ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో.. దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారీ మెజారిటీతో స్థిర, దృఢమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే.. మహిళా రిజర్వేషన్ బిల్లు సాకారం అయ్యిందని చెప్పారు ప్రధాని మోదీ. బలమైన, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దేశం అభివృద్ధి దిశగా సాగుతోందని.. మహిళా రిజర్వేషన్​ బిల్లు నిరూపించిందన్నారు. ఒకప్పుడు ఈ బిల్లును వ్యతిరేకించిన వారే.. మహిళల శక్తిని తెలుసుకుని మద్దతు తెలిపారని వ్యాఖ్యానించారు.

"దేశ ప్రజలు ముఖ్యంగా మహిళలు.. ఓటువేసి మెజార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు కారణమయ్యారు. మెజార్టీ ప్రభుత్వం ఉంటే దేశం ఏ విధంగా పెద్ద నిర్ణయాలు తీసుకుంటుందో, సవాళ్లను ఎలా అధిగమిస్తుందో చెప్పేందుకు మహిళా బిల్లే సాక్ష్యంగా నిలుస్తోంది. దేశంలో మెజార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్నో పనులు జరిగాయి. మహిళల ప్రయోజనం కోసం ప్రతిదశలోనూ నిర్ణయం తీసుకున్నాం."

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

మహిళా బిల్లు ఆమోదానికి ఎవరి రాజకీయ ప్రయోజనాలూ అడ్డంకిగా మారకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు మోదీ. పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదానికి ఎన్నో అడ్డంకులు ఉండేవని.. అయితే మంచి ఉద్దేశంతో పాటు పారదర్శక చర్యలతో వాటిని అధిగమించినట్లు ప్రధాని తెలిపారు. పార్లమెంటులో మహిళా బిల్లుకు భారీ మద్దతు లభించటం ఓ రికార్డ్‌ అన్నారు. అందుకు కారణమైన రాజకీయ పార్టీలు, ఎంపీలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

అంతకుముందు బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ప్రధానికి.. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ మహిళా కార్యకర్తలు.. ప్రధాని మోదీని పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్​, స్మృతి ఇరానీ పాల్గొన్నారు.

Parliament Session Sine Die : షెడ్యూల్​కు ముందే పార్లమెంట్ నిరవధిక వాయిదా.. మహిళా రిజర్వేషన్​ బిల్లు ఆమోదం పొందాకే..

Women Reservation In Lok Sabha : మహిళా రిజర్వేషన్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం

Last Updated : Sep 22, 2023, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details