తెలంగాణ

telangana

యువకులపై మూక దాడి- కత్తులతో పొడిచి..

By

Published : Nov 22, 2021, 8:55 AM IST

ahmedabad mob lynching

గుజరాత్​లో మహమ్మద్ రోహన్, నౌషద్ అనే యువకులపై మూక దాడి (Ahmedabad Mob Lynching) జరిగింది. ఆరుగురు ముస్లిమేతర వ్యక్తులు కత్తులతో దాడి చేశారని బాధితులు ఆరోపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గుజరాత్​లోని అహ్మదాబాద్​లో ఇద్దరు యువకులపై మూక దాడి (Mob Lynching news) జరిగింది. మహమ్మద్ రోహన్, నౌషద్ అనే వ్యక్తులపై ఆరుగురు కలిసి కత్తులతో దాడి చేశారు. నవంబర్ 18న ఈ ఘటన జరిగింది.

గురువారం ఉదయం 9.45 గంటల సమయంలో నౌషద్ సహా మరికొంతమంది స్నేహితులతో కలిసి ఉస్మాన్ పురా గార్డెన్ వద్ద కూర్చున్నామని రోహన్ తెలిపారు. ఈ సమయంలో ఆరుగురు ముస్లిమేతర యువకులు వచ్చి వీరి.. పేర్లు అడిగి దుర్భాషలాడారని చెప్పారు. పేర్లు చెప్పిన వెంటనే కత్తులతో దాడి చేశారని వివరించారు. దీంతో వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్లు చెప్పారు.

దాడిలో గాయపడ్డ యువకుడు రోహన్

"దాడిలో మాకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు 108కి ఫోన్ చేశారు. తర్వాత మమ్మల్ని సియోల్ ఆస్పత్రికి తరలించారు. నాకు కత్తి గాయాలు అయ్యాయి. చికిత్స చేసి నన్ను డిశ్చార్జ్ చేశారు. తీవ్రంగా గాయపడ్డ నుషాద్​ను ఐసీయూలో చేర్చారు."

-మహమ్మద్ రోహన్, గాయపడ్డ యువకుడు

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధిత యువకుల స్టేట్​మెంట్​ను రికార్డు చేసుకున్నారు.

మరోవైపు, సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దాడిని ఖండించింది. రోహన్, నౌషద్​లకు న్యాయ సహాయం అందిస్తామని తెలిపింది. ఘటనకు కారకులైనవారిని చట్టం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది. కమిషనర్, డీజీపీలకు పరిస్థితిని వివరించామని పార్టీ ప్రతినిధి ఇర్షాద్ షేక్ పేర్కొన్నారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

యువకులను పరామర్శిస్తున్న పార్టీ ప్రతినిధులు

ఇదీ చదవండి:పార్లమెంట్​ సమావేశాల్లో విపక్షాల అస్త్రాలు ఇవే!

ABOUT THE AUTHOR

...view details