తెలంగాణ

telangana

సైకోప్రేమికుడిపై గ్రామస్థుల దాడి.. చివరకు

By

Published : Oct 30, 2021, 7:24 PM IST

తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడిచేశాడు ఓ సైకో ప్రేమికుడు. అర్ధరాత్రి సమయంలో యువతి ఇంట్లో దూరి నిద్రిస్తుండగా దాడిచేశాడు. గ్రామస్థులు యువకుడ్ని పట్టుకొని కొట్టి చంపారు. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

mob lynching
సైకోప్రేమికుడిపై గ్రామస్థుల దాడి

ఝార్ఖండ్​లో ఓ సైకోప్రేమికుడిని కొట్టి చంపారు గ్రామస్థులు. ఈ ఘటన గొడ్డా జిల్లా రాజ్​బితా పోలీస్​స్టేషన్​ పరిధిలోని చాంద్​నా గ్రామంలో జరిగింది.

ఏమైందంటే..?

చాంద్​నా గ్రామానికి చెందిన మున్నా పహాడియా.. ఓ యువతిని ప్రేమించాడు. అతడి ప్రేమను ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న మున్నా.. అర్ధరాత్రి యువతి ఇంట్రో దూరి ఆమెను కత్తితో దాడి చేశాడు. అనంతరం పరారయ్యేందుకు యత్నించిన మున్నాను గ్రామస్థులు పట్టుకొని చితకబాదారు. నిందితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మున్నా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

వెంటనే సమాచారం అందుకున్న రాజ్​బితా ​స్టేషన్​ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై ​కేసు నమోదు చేశారు.

కోటాలో మరో మూకదాడి..

రాజస్థాన్​లోని కోటాలో మరో మూకదాడి ఘటన జరిగింది. సూర్యనగర్​కు చెందిన శశి భూమ్​లియాపై (40) ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈఘటనలో శశి మృతిచెందాడు. మద్యం మత్తులో శశి.. నిందితులతో గొడవ పడినట్లు.. ఈక్రమంలో శశిపై నిందితులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:భర్తే పెళ్లి పెద్ద- భార్యకు దగ్గరుండి ప్రేమ వివాహం

ABOUT THE AUTHOR

...view details