తెలంగాణ

telangana

దళితుడిపై మూకదాడి, బలవంతంగా మూత్రం తాగించి

By

Published : Aug 26, 2022, 9:19 PM IST

బిహార్ దర్బంగలో దారుణం జరిగింది. దొంగతనానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ దళితుడిపై మూకదాడి చేశారు దుండగులు. అతడి చేతులు, కాళ్లు కట్టేసి కర్రలతో దాడికి పాల్పడింది అల్లరిమూక. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Mob Lynching in Darbhaga
మూకదాడి

బిహార్‌లోని దర్భంగలో దారుణ ఘటన జరిగింది. దొంగతనానికి పాల్పడ్డాడని ఓ దళితుడిపై మూకదాడికి దిగారు దుండగులు. ఈ దాడిలో బాధితుడు ఎముకలు విరగొట్టారు. దాహం వేస్తుందంటూ బాధితుడు నీరు అడడగా.. బలవంతంగా అతడితో మూత్రాన్ని తాగించారు. ఓ వర్గానికి చెందిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. దళితుడిపై దాడి విషయం తెలుసుకున్న దర్భంగ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు.

పోలీసులు వివరాల ప్రకారం.. దర్భంగలోని కియోటి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజోరా గ్రామానికి చెందిన రామ్ ప్రకాశ్ పాశ్వాన్ అనే దళితుడు దొంగతనానానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ అతడిపై దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఆగస్టు 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండగులు కర్రలతో కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్​గా మారడం వల్ల ఈ దారుణం బయటపడింది. కొంతమంది దుండగులు బాధితుడు రామ్ ప్రకాశ్ పాశ్వాన్.. చేతులు, కాళ్లను తాడుతో కట్టి కర్రలతో అతడిపై దాడి చేశారు.

"ఆగస్టు 16 రాత్రి మధుబనీలోని మా అమ్మమ్మ వాళ్ల ఇంటి నుంచి నా తండ్రి వస్తున్నాడు. అతను రహికా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిజ్రా గ్రామానికి చేరుకున్నప్పుడు ఎవరో ఆగమని పిలిచారు. ఆ తర్వాత కొందరు వచ్చి దాడికి పాల్పడ్డారు. కర్రలతో చేతులు, కాళ్ల మీద కొట్టారు. ప్రస్తుతం నాన్న పరిస్థితి విషమంగా ఉంది."

ABOUT THE AUTHOR

...view details