తెలంగాణ

telangana

బండి సంజయ్​ అరెస్టు అందుకేనట.. కారణం చెప్పిన మంత్రులు

By

Published : Apr 5, 2023, 12:47 PM IST

Updated : Apr 5, 2023, 2:28 PM IST

ktr and harish rao on bandi sanjay arrest : బండి సంజయ్‌ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు... బండి అరెస్టుపై వివరణ ఇచ్చారు. పేపర్‌ లీకేజీల సూత్రధారి బండి సంజయేనని ఆరోపణలు చేశారు.

KTR BRS
KTR BRS

ktr and harish rao on bandi sanjay arrest : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ అర్ధరాత్రి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే బండి అరెస్టుపై బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ నిలదీశారు. తాజాగా దీనిపై మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు స్పందించారు. బండి సంజయ్‌ అరెస్టుకు గల కారణాలు చెప్పారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.

KTR Tweet on Bandi Sanjay Arrest issue : స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ నాయకులు... విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్, తదనంతర పరిణామాల నేపథ్యంలో కేటీఆర్.. ట్విటర్ వేదికగా స్పందించారు. 'పిచ్చోని చేతిలో రాయి ఉంటే... వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం కానీ.. అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని' కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నాపత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటమాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

''పిచ్చోని చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం... కానీ పిచ్చోని చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నాపత్రాలు లీకు చేస్తున్నారు. బీజీపీ నేతలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అమాయక విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.'' - ట్విటర్‌లో మంత్రి కేటీఆర్

Minister Harish Rao Comments on bandi arrest ఇక ఇదే విషయంపై మంత్రి హరీశ్‌రావు కూడా స్పందించారు. మెదక్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన బండి సంజయ్‌పై తనదైన శైలిలో మండిపడ్డారు. బీజేపీవి దిగజారుడు రాజకీయాలు అని మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలా? అని ప్రశ్నించారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడండని సవాల్ విసిరారు. పిల్లల జీవితాలతో, భవిష్యత్‌తో ఆటలాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

''ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాజపాకు గుణపాఠం చెప్పాలి. బీజేపీ నేతలకు చదువు విలువ తెలియదు. పదో తరగతి పేపర్‌ లీకేజీల సూత్రధారి బండి సంజయ్‌. ప్రజలు అసహ్యించుకునేలా బీజేపీ నేతల తీరు ఉంది. పేపర్‌ లీకుల సూత్రధారులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది. బండి సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరుతున్నా.. పదో తరగతి పేపర్‌ లీకేజీపై బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలి.'' - మంత్రి హరీశ్‌రావు

పట్టపగలు స్పష్టంగా దొరికిన దొంగ బండి సంజయ్‌ అని హరీశ్‌రావు ఆరోపణలు చేశారు. బీజీపీ క్షుద్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. పేపర్‌ లీకేజీ నిందితుల విడుదల కోసం బీజీపీ నేతలు ధర్నా చేశారని వెల్లడించారు. పసి పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికారం కోసం ఏదైనా చేసేందుకు బీజీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.

బండి సంజయ్​ అరెస్టు అందుకేనట.. కారణం చెప్పిన మంత్రులు

‘‘వాట్సప్‌లో ప్రశ్నపత్రం పెట్టిన నిందితుడు ప్రశాంత్‌ భాజపా కార్యకర్తా? కాదా? సంజయ్‌కు అతడు ప్రశ్నపత్రం పంపించింది నిజమా? కాదా? రోజుకో పేపర్‌ లీకేజీ పేరుతో భాజపా కుట్రలు పన్నిన మాట వాస్తవమా? కాదా? సంజయ్‌కు ప్రశ్నపత్రం పంపిన ప్రశాంత్‌.. 2 గంటల్లో 142 సార్లు ఫోన్‌లో మాట్లాడాడు. అందులో భాగంగా సంజయ్‌కు కూడా ఫోన్‌ చేశాడు. ఇది నిజమా? కాదా? ఈ ప్రశ్నలకు భాజపా నేతలు సూటిగా సమాధానం చెప్పాలి ’’ -మంత్రి హరీశ్‌రావు

ఇవీ చూడండి:

Last Updated : Apr 5, 2023, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details