తెలంగాణ

telangana

Gang Rape: వివాహితపై ఆటో డ్రైవర్ల గ్యాంగ్​రేప్​.. ఆలస్యంగా వెలుగులోకి

By

Published : Apr 30, 2023, 7:25 AM IST

woman gang raped by auto drivers: హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. అర్ధరాత్రి ఆటో కోసం వేచి చూస్తున్న ఓ వివాహితపై కొందరు ఆటో డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కించుకొని.. సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఏప్రిల్​ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Gang rape
Gang rape

woman gang raped by auto drivers: అర్ధరాత్రి.. సమయం 12 గంటలు.. నగరం నిర్మానుష్యుంగా ఉంది. పని మీద బయటకు వెళ్లిన ఓ వివాహిత పనులు ముగించుకొని ఆ సమయంలో ఆటో కోసం ఎదురు చూస్తోంది. అర్ధరాత్రి కావడంతో కేయూ క్రాస్‌ వద్ద రోడ్డుపై వెళుతున్న ఆటోను ఆపి తనను రంగ్‌బార్‌ వద్ద దింపాలని డ్రైవర్‌ను కోరింది. మహిళను ఆటో ఎక్కించుకున్న డ్రైవర్‌ రాకేశ్‌.. తన స్నేహితులైన ఆటో డ్రైవర్లు సనత్‌, సతీశ్​కు ఫోన్‌ చేయగానే కొద్దిసేపటికే వాళ్లు వచ్చి ఆటో ఎక్కారు.

ఆ తరువాత ఆమె చెప్పిన చోటుకు కాకుండా వేరే మార్గం వైపు ఆటోను తీసుకెళ్లారు. దీంతో తనను ఎటు తీసుకెళ్తున్నారంటూ ఆమె అరవడం ప్రారంభించారు. రాకేశ్‌ స్నేహితులు ఆమెను అరవొద్దంటూ బెదిరించారు. భీమారం గ్రామ శివారులోకి వెళ్లిన తర్వాత ఆటో సౌండ్‌ బాక్స్‌ శబ్దం బాగా పెంచి ఆటోలో ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. తర్వాత రంగ్‌బార్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హనుమకొండ పట్టణంలో చోటుచేసుకొంది.

హనుమకొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని నయీంనగర్‌ సమీపంలో నివసిస్తున్న వివాహిత ఏప్రిల్‌ 27న పని మీద బయటకు వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి కావడంతో కేయూ క్రాస్‌ వద్ద రోడ్డుపై వెళుతున్న ఆటోను ఆపారు. తనను రంగ్‌బార్‌ వద్ద దింపాలని డ్రైవర్‌ను కోరారు. దానికి ఆటో డ్రైవర్​ సరే అని చెప్పారు. మహిళను ఆటోలో ఎక్కించుకున్న రాకేశ్​ అనే డ్రైవర్‌.. తన స్నేహితులైన ఆటో డ్రైవర్లు సనత్‌, సతీష్‌కు ఫోన్‌ చేసి రమ్మన్నాడు. కొద్దిసేపటికే వాళ్లు వచ్చి ఆటో ఎక్కారు. ఆ తరువాత మహిళ చెప్పిన అడ్రెస్​కు కాకుండా భీమారం వైపు ఆటో తీసుకెళ్లారు.

woman Gang rape in Hanamakonda: దీంతో తనను ఎటు తీసుకెళ్తున్నారంటూ ఆమె అరవడం ప్రారంభించారు. రాకేశ్‌ స్నేహితులు ఆమెను అరవొద్దంటూ బెదిరించారు. భీమారం గ్రామ శివారులోకి వెళ్లిన తర్వాత ఆటో సౌండ్‌ బాక్స్‌ శబ్దం బాగా పెంచి ఆటోలో ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. తర్వాత రంగ్‌బార్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన మహిళ బంధువులకు విషయం తెలపడంతో వారు హనుమకొండ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మహిళకు వైద్య పరీక్షలు చేయించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు హనుమకొండ ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details