తెలంగాణ

telangana

Monsoon: దంచికొట్టిన వర్షం- రోడ్లు జలమయం

By

Published : Jun 11, 2021, 9:52 AM IST

Updated : Jun 11, 2021, 2:21 PM IST

మహారాష్ట్ర భారీ వర్షాలతో చిగురుటాకులాగా వణుకుతోంది. వర్షాల ధాటికి రోడ్లలన్నీ జలమయం అయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో ఐదు రోజలు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Mumbai rains
ముంబయి వర్షాలు

దంచికొట్టిన వర్షం- రోడ్లు జలమయం

మహారాష్ట్రలోని పలు జిల్లాలు సహా ముంబయిలో కుండపోత వర్షాలు(Mumbai rains) కురుస్తున్నాయి. మరో ఐదురోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ విభాగం.. ముంబయికి ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. పాల్ఘర్‌, రాయ్‌గఢ్‌, ఠాణెలకూ వర్ష సూచన చేసింది.

మహారాష్ట్రను ముంచెత్తుతున్న వర్షాలు
వరద నీటిలో చిక్కుకున్న వాహనదారులు
రోడ్డుపై భారీగా చేరిన వరద నీరు
భార్షీ వర్షాలతో వాహనదారుల అవస్థలు

ముంబయిలో గురవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్ల లోతులో వాననీరు నిలిచిపోయింది. అంధేరి, మహీం చర్చ్‌ తదితర ప్రాంతాల్లో వంతెన కింది ఉన్న రోడ్లతోపాటు సబ్‌వేల్లోకి వాననీరు పెద్దమొత్తంలో చేరటం వల్ల వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.

ఇదీ చూడండి:కల్తీ ఆహారంతో ఆరోగ్య భద్రతకు సవాలు

Last Updated :Jun 11, 2021, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details