తెలంగాణ

telangana

మహారాష్ట్రలో భారీగా పెరిగిన కరోనా కేసులు

By

Published : Jun 15, 2022, 10:15 PM IST

Covid 19 Cases: మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. దిల్లీలోనూ కొత్త కేసుల్లో 22 శాతం వృద్ధి నమోదైంది. పాజిటివిటీ రేటు 7శాతం దాటింది.

Covid 19 Cases
మహారాష్ట్రలో భారీగా పెరిగిన కరోనా కేసులు

Corona Cases: మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం మరో 4,024 కొత్త కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 3,028 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,261గా ఉంది. మహారాష్ట్రలో కొత్తగా నమోదైన 4,024 కేసుల్లో రాజధాని ముంబయి నుంచే 2,293 కేసులు ఉండటం గమనార్హం. దాదాపు ఐదు నెలల తర్వాత నగరంలో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూశాయి. కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. నాలుగో వేవ్​కు ఇది సంకేతమా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా తొలి మూడు దశల్లో దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు వెలుగుచూశాయి.

దిల్లీలో: దేశ రాజధాని దిల్లీలోనూ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం మరో 1,375 మంది వైరస్ బారినపడ్డారు. మే 8 తర్వాత ఇవే అత్యధిక కేసులు. మరోవైపు పాజిటివీ రేటు కూడా 7 శాతం దాటడం కలవరపాటుకు గురి చేస్తోంది. అయితే వైరస్ కారణంగా ఒక్కరు కూడా మరణించకపోవడం కాస్త ఊరటనిస్తోంది. దిల్లీలో మంగళవారం 1,100 కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details