తెలంగాణ

telangana

వరద విలయం- 47 గ్రామాలు జలదిగ్బంధం

By

Published : Jul 23, 2021, 9:34 AM IST

Updated : Jul 23, 2021, 12:03 PM IST

భారీవర్షాల కారణంగా మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతోంది. రాయ్​గఢ్​లో వరదల కారణంగా ఐదుగురు మృతిచెందారు. వరద ప్రవాహానికి 47 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తీర ప్రాంతంలోని 965 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

floods
వరద విలయం

వరద విలయం

మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరద ప్రభావంతో కొంకణ్​ తీర ప్రాంతంలోని రోడ్లు పూర్తిగా జలదిగ్భందమయ్యాయి. రాయ్​గఢ్​లో వరదల కారణంగా ఐదుగురు మృతిచెందారు. 47 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా వర్షపు నీరు చేరటం వల్ల కొల్హాపుర్​లోని పంచ్​గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తీర ప్రాంతంలోని 965 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

నీట మునిగిన భవనాలు
మునిగిన భవనాలు

కొండ చరియలు విరిగిపడి...

రాయ్​గఢ్​ జిల్లాలోని మహద్​ తలై గ్రామంలో గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. సుమారు 300 మంది చిక్కుకున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. రోడ్లు జలమయం కావటంవల్ల ఘటనా స్థలానికి చేరుకోవటం సమస్యగా మారిందని రాయ్​గఢ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఉదయం అక్కడకు చేరుకున్న అధికారులు... 30 మంది చిక్కుకున్నారని, వారిలో 15 మందిని రక్షించామని చెప్పారు.

వరదనీటిలో చిక్కకున్న గ్రామాలు
కొనసాగుతున్న సహాయక చర్యలు
ప్రజలను రక్షించేందుకు పడవలను సిద్ధం చేస్తూ..

అంతకుముందు.. గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. అత్యవసర సమావేశం నిర్వహించారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి.. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.

ప్రధాని ఫోన్​..

గ్రామాలు మునక
నీట మునిగిన భవనాలు

మహారాష్ట్రలో భారీ వర్షాల దృష్ట్యా.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్​లో సంభాషించారు. పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్రం నుంచి అన్నివిధాలా సాయం అందుతుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:చరిత్రలో తొలిసారి నీట మునిగిన జ్యోతిర్లింగం

భారీ వర్షాలకు మహారాష్ట్ర విలవిల- ఠాక్రేకు ప్రధాని ఫోన్​

కాలనీలు జలమయం- రైళ్లలో చిక్కుకున్న 6వేల మంది!

Last Updated :Jul 23, 2021, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details