తెలంగాణ

telangana

కాలనీలు జలమయం- రైళ్లలో చిక్కుకున్న 6వేల మంది!

By

Published : Jul 22, 2021, 2:35 PM IST

భారీ వర్షాలు మహారాష్ట్ర భీవండిలోని జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుకోవడం వల్ల.. అక్కడి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, వర్షాల ప్రభావంతో నిలిచిపోయిన పలు రైళ్లలో ఆరు వేల మంది ప్రయాణికులు చిక్కుకున్నారు.

maharashtra bhiwandi rains
మహారాష్ట్ర వర్షాలు

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటం వల్ల.. భీవండిలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి.

డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక నీరంతా కాలనీలలోనే నిల్వ ఉంటోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొందరు ఆ నీటిలో ఈదుకుంటూనే ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

వరద ముంపులో కాలనీలు

వరదలో చిక్కుకుపోయిన ప్రజలను కాపాడేందుకు జాతీయ విపత్తు స్పందన దళం రంగంలోకి దిగింది. ఇళ్లలోని వారిని బయటకు తీసుకొస్తోంది. సహాయ బోట్లను ఉపయోగించి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

సహాయక పడవల్లో బాధితుల తరలింపు

రైళ్లలోనే 6 వేల మంది

మరోవైపు, రత్నగిరి జిల్లాలోని కొంకణ్ రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు ఎనిమిది రైళ్లను రెగ్యులేట్(రద్దు, నిలిపివేత లేదా మార్గం మళ్లించడం) చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో 6 వేల మంది ప్రయాణికులు ఆయా రైళ్లలోనే చిక్కుకున్నారు. వీరంతా సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేశారు. ఆహారం, నీళ్లు అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:సొరంగంలో చిక్కుకొని 13 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details