తెలంగాణ

telangana

మోదీతో మహారాష్ట్ర సీఎం ఠాక్రే భేటీ

By

Published : Jun 8, 2021, 12:08 PM IST

Updated : Jun 8, 2021, 12:49 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సమావేశమయ్యారు. తుపాను సాయం, మరాఠా రిజర్వేషన్లు తదితర అంశాలపై ప్రధానితో ఠాక్రే చర్చించారు.

Uddhav Thackeray meet PM Modi
మోదీతో మహారాష్ట్ర సీఎం ఠాక్రే భేటీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. ఉదయం 11.30 సమయంలో.. ప్రధాని అధికారిక నివాసం ఉన్న 7 లోక్​ కల్యాణ్ మార్గ్​కు ఠాక్రే చేరుకున్నారు. మరాఠా రిజర్వేషన్లు, తుపాను సాయం, టీకాలు తదితర అంశాలపై మోదీతో చర్చలు జరిపారు. ఠాక్రే వెంట మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, మంత్రి అశోక్ చవాన్​లు వెళ్లారు.

సమావేశంలో మోదీ, ఠాక్రే, పవార్, చవాన్

మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గత నెల సంచలన తీర్పు ఇచ్చింది. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మహరాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. మరాఠా రిజర్వేషన్లు.. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:Rape: లిఫ్ట్​ ఇచ్చి.. యువతిపై అత్యాచారం

Last Updated :Jun 8, 2021, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details