తెలంగాణ

telangana

స్కూల్​కి తాగొచ్చిన హెడ్​మాస్టర్.. బాలికలను గదిలోకి తీసుకెళ్లి..

By

Published : Oct 31, 2021, 10:05 PM IST

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు వికృతంగా ప్రవర్తించాడు. సొంత పిల్లల్లా చూసుకోవాల్సిన విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో పాఠశాలకు రావడమే కాకుండా.. తనతో డ్యాన్స్ చేయాల్సిందిగా బలవంతం చేశాడు.

HEADMASTER DANCE
హెడ్​మాస్టర్ డ్యాన్స్

ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడో గురువు. మద్యం మత్తులో తనతో కలసి డ్యాన్స్ చేయాల్సిందిగా బాలికలను బలవంతం చేశాడు. చివరకు సస్పెండ్ అయ్యాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకివచ్చింది.

ఇదీ జరిగింది..

దామోహ్ జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలోని మధియాడో గ్రామ ప్రభుత్వ పాఠశాలలో రాజేష్ ముండా అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం మద్యం మత్తులో పాఠశాలకు రావడమే గాక.. బాలికలను ఓ గదిలోకి తీసుకెళ్లి తలుపు వేశాడు. తనతో నృత్యం చేయాల్సిందిగా బలవంతం చేశాడు. ఆ డ్యాన్స్ వీడియోలను తన సెల్​ఫోన్లో చిత్రీకరించాడు.

అనంతరం ఇళ్లకు చేరుకున్న విద్యార్థినులు జరిగిన విషయాన్ని తమ తల్లిదండ్రులకు వివరించారు. ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ చైతన్య విచారణకు ఆదేశించారు. విద్యాశాఖ నివేదిక అనంతరం.. ప్రధానోపాధ్యాయుడిని తక్షణమే విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details