తెలంగాణ

telangana

ఎకనామిక్స్​లో మాస్టర్స్​.. హత్యలు చేసి ఆన్​లైన్​ ట్రేడింగ్​

By

Published : Feb 13, 2022, 2:21 PM IST

Serial killer Rajendran arrest: తమిళనాడు నాగర్​కోయల్​కు చెందిన ఓ సీరియల్​ కిల్లర్​ను కేరళ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితునికి ఇప్పటివరకు ఐదు హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు అధికారులు చెప్పారు.

Serial killer Rajendran arrest
పట్టుబడిన సీరియల్​ కిల్లర్​

Serial killer Rajendran arrest: తమిళనాడు నాగర్​కోయల్​కు చెందిన సీరియల్​ కిల్లర్ రాజేంద్రన్​ను కేరళ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇప్పటికే నిందితుడు ఐదు హత్యలు చేసినట్లు చెప్పారు. హతమార్చాలనుకున్న వారికి సన్నిహితంగా మెలిగి.. చివరకు ప్రాణాలు తీసేవాడని తెలిపారు. ఇటీవల కేరళ వచ్చిన నిందితుడు వినీతా అనే మహిళను బంగారం కోసం హతమార్చినట్లు వివరించారు. ఆమెను హత్య చేసి మెడలోని బంగారాన్ని దొంగిలించి పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ చేపట్టగా విస్తుపోయా నిజాలు తెలిసినట్లు పేర్కొన్నారు పోలీసులు.

ఎకనామిక్స్​లో మాస్టర్స్​..

ఎకనామిక్స్‌లో మాస్టర్స్, ఎంబీఏ చేసిన ఈ సీరియల్​ కిల్లర్​.. ఆన్​లైన్​ ట్రేడింగ్​ చేసేందుకు డబ్బు కోసం హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బంగారాన్ని దొంగలించే వాడని.. అనంతరం వాటిని తాకట్టు పెట్టి వచ్చిన నగదుతో ఆన్​లైన్​ ట్రైడింగ్​ చేసేవాడని తెలిపారు. గతంలో నిందితుడు తమిళనాడులో ఉన్నప్పుడు అలానే నాలుగు హత్యలు చేసినట్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏ కేసులోనూ శిక్ష పడలేదని వివరించారు. కేరళకు వచ్చే ముందే ఓ కస్టమ్స్​ ఆఫీసర్​ కుటుంబాన్ని హత మార్చినట్లు చెప్పారు.

తొలుత విచారణకు సహకరించని రాజేంద్రన్‌.. అనంతరం జరిగిన విచారణలో తాను చేసిన హత్యలు, దొంగతనాలను పోలీసుల ముందు అంగీకరించాడు.

ఇదీ చూడండి:

భారీగా డ్రగ్స్​ పట్టివేత.. విలువ రూ.60 కోట్లకు పైనే!

ABOUT THE AUTHOR

...view details