తెలంగాణ

telangana

ఆ రాష్ట్రంలో వీధి శునకాల సంరక్షణకు ప్రత్యేక నిధి

By

Published : May 9, 2021, 8:20 PM IST

ఒడిశాలో 14 రోజుల పాటు లాక్​డౌన్ విధించిన నేపథ్యంలో వీధి జంతువుల ఆలనాపాలనా కోసం రూ. 60 లక్షలు మంజూరు చేశారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. స్వచ్ఛంద సంస్థల ద్వారా.. ఈ నిధితో 48 మున్సిపాలిటీల్లోని వీధి కుక్కలు, ఇతర జంతువులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహారాన్ని అందించనుంది.

odisha cm navin patnaik
ఒడిశా ముఖ్యమంత్రి

కరోనా కట్టడి కోసం 14 రోజులపాటు లాక్​డౌన్ విధించింది ఒడిశా ప్రభుత్వం. అయితే.. లాక్​డౌన్​ సమయంలో నగరాల్లోని వీధి జంతువులకు ఆహారాన్ని అందించేందుకు రూ. 60 లక్షలు మంజూరు చేశారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్​ఎఫ్​) నుంచి నిధులను మంజూరు చేసినట్లు సీఎం కార్యాలయం పేర్కొంది.

శునకాలతో ప్రేమగా ఒడిశా సీఎం
శునకంతో ప్రేమగా.. ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్

స్వచ్ఛంద సంస్థల ద్వారా

రాష్ట్రంలోని 48 మున్సిపాలిటీలు, 61 నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్​లోని వీధి కుక్కలు, ఇతర వీధి జంతువులకు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆహారాన్ని అందించనున్నట్లు వెల్లడించింది.

ఆర్మీ శునకాన్ని సత్కరిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్

భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్లు రోజుకు రూ. 20వేలు వీధి జంతువుల సంరక్షణ కోసం ఖర్చుచేయాలని ప్రకటనలో తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్​.. రూ. 2 వేలు ఖర్చు చేయాలని పేర్కొంది.

ఇదీ చదవండి :'స్వీయ జాగ్రత్తలు పాటిస్తే మూడో దశ ముప్పు తక్కువే'

ABOUT THE AUTHOR

...view details