తెలంగాణ

telangana

Lift Collapse In Thane : లిఫ్ట్ కుప్పకూలి ఆరుగురు కూలీలు మృతి.. కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో మరో ఏడుగురు దుర్మరణం..

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 8:31 PM IST

Updated : Sep 11, 2023, 6:45 AM IST

Lift Collapse In Thane
Lift Collapse In Thane

20:23 September 10

Lift Collapse In Thane : లిఫ్ట్ కుప్పకూలి ఆరుగురు కూలీలు మృతి.. కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో మరో ఏడుగురు దుర్మరణం..

కుప్పకూలిన లిఫ్ట్​

Lift Collapse In Thane :మహారాష్ట్రలోని ఠాణెలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలోని లిఫ్ట్ కుప్పకూలిన ఘటనలో ఆరుగురు కూలీలు మరణించగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి ఘోడ్​బందర్​ జరిగిందీ దుర్ఘటన జరిగినట్లు వెల్లడించారు.

అది నిర్మాణంలో ఉన్న లిఫ్ట్​ అని.. సాధారణ ఎలివేటర్​ కాదని ఠాణె మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారి యూసిన్​ తాడ్వి తెలిపారు. 40 అంతస్తు నుంచి లిఫ్ట్ కుప్పకూలినట్లు చెప్పారు. కూలీలు తమ పనులు ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక కార్పొరేటర్ సంజయ్ డిమాండ్ చేశారు.

కారు-ట్రక్కు ఢీ.. ఏడుగురు మృతి
Assam Road Accident :అసోంలోని దిబ్రుగఢ్​ జిల్లాలో జరిగిన ఇన్నోవా కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పాయారు. అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. హుటాహుటిన గాయపడిన వారిని స్థానిక అసోం మెడికల్​ కాలేజీలో చేర్పించారు. మృతి చెందిన వారి మృతదేహాలను శవపరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

స్నానానికి వెళ్లిన ముగ్గురు మృతి
Child Fell Into Water Tank : రాజస్థాన్​లోని రాజ్​సమంద్​లో ఘోరం జరిగింది. స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు వాటర్ ట్యాంక్​లో పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో జుందాఖేడీ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతులను నారాయణలాల్ (9), అతడి సోదరి పూజ (6), వారి బంధువు నరేంద్ర (8)గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం పరీక్షల అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Last Updated :Sep 11, 2023, 6:45 AM IST

ABOUT THE AUTHOR

...view details