తెలంగాణ

telangana

ఆకుకూరల డాక్టర్.. ఏం తింటే ఏం లాభమో ఇట్టే చెప్పే పెద్దాయన.. 50 రకాలు సాగు

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 8:33 PM IST

leafy vegetables Campaigner kerela : ఆకుకూరల ఆవశ్యకతను యువతకు, సమాజానికి తెలియజేసేందుకు నడుం బిగించాడు ఓ వృద్ధుడు. తనకున్న పొలంలో దాదాపు 50 రకాల ఆకుకూరలను పండిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. మరి కేరళకు చెందిన వృద్ధుడి విజయగాథ తెలుసుకుందామా.

leafy vegetables Campaigner kerela
leafy vegetables Campaigner kerela

ఆకుకూరల డాక్టర్.. ఏం తింటే ఏం లాభమో ఇట్టే చెప్పే పెద్దాయన.. 50 రకాలు సాగు

leafy vegetables Campaigner kerela :తోటకూర తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందా? ఆకుకూరల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్​ను ఆపగలవా? కళ్లు బాగా కనిపించాలంటే ఏం తినాలి? ఇటువంటి ప్రశ్నలన్నింటికీ ఓ వృద్ధుడు టకాటకా సమాధానాలు చెప్పేస్తున్నాడు. అలాగని ఆయనేమీ వైద్యుడో, పోషకాహార నిపుణుడో కాదు. కానీ ఆకుకూరల్లో ఉండే ఔషధ గుణాలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నాడు. ఆతడే కేరళకు చెందిన అబూబాకర్ అనే 82 ఏళ్ల వృద్ధుడు.

ఆకుకూరలను పెంచుతున్న రైతు అబూబాకర్

కోజికోడ్​లోని పుక్కాడ్​కు చెందిన వన్నంగుని అబూబాకర్​కు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే తనకున్న భూమిలో దాదాపు 50 రకాల ఆకుకూరలను, అలాగే కొన్ని రకాల పండ్ల చెట్లను పెంచుతున్నాడు. కంటి సమస్యలు, ఊబకాయం, రక్తహీనత, బీపీ, గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడాలంటే ఆకుకూరలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నాడు. మనకు దొరికే ఆకుకూరల్లోనే ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని అంటున్నాడు.

వ్యవసాయ భూమిలో అబూబాకర్

"మనకు తెలిసిన కూరగాయల మొక్కలను 10 సెంట్లు లేదా ఐదు సెంట్ల భూమిలో సాగు చేసుకోవచ్చు. అవి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. మొక్కలు మనకు దేవుడు ఇచ్చినవి. వాటిని మనమే కాపాడుకోవాలి."
--అబూబాకర్​, రైతు

ఆకుకూరల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటిలో ఉన్న ఔషధ గుణాలు తనకు చిన్నప్పుడే తెలుసని అబూబాకర్ చెబుతున్నాడు. ఆకు కూరల్లో పుష్కలంగా మాంసకృత్తులు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌ అధికంగా ఉంటుందని అంటున్నాడు. కోజికోడ్​లో జరిగే వ్యవసాయ సమ్మేళనాల్లో పాల్గొని.. అక్కడ వేలాది మందికి ఆకుకూరల వల్ల కలిగే లాభాలను వివరిస్తుంటానని అబూబాకర్ తెలిపాడు.

అబూబాకర్ వ్యవసాయ భూమిలో ఆకుకూరలు

"ఆకుకూరలు, పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఆకుకూరల్లో పెద్ద మొత్తంలో విటమిన్ సి, కాల్షియం, బీటా కెరోటిన్, ఫైబర్ ఉంటాయి. అవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆకుకూరల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్​ రాకుండా కాపాడతాయి. జీర్ణక్రియ, ఎముకల పెరుగుదలకు సాయపడతాయి." అని అబూబాకర్ వివరించాడు.

అయితే ఈ ఆకుకూరల పెంపకం, వాటి గురించి ప్రచారం అబూబాకర్​తోనే ఆగిపోకుండా అతడి కుమార్తె రజియా, అల్లుడు లతీఫ్ కూడా కొనసాగిస్తున్నారు. జపాన్ శాస్త్రజ్ఞుడు అకిరా మియావాకీచే సూచించిన విధంగా వ్యవసాయం చేస్తున్నారు.

50ఏళ్లుగా టమాటా సాగు.. ఇప్పుడు 'లాభాల పంట'.. నెలలోనే కోటీశ్వరుడిగా మారి..

చిన్న ఊరిలో 100 CCTV కెమెరాలు- ప్రెసిడెంట్​ చొరవతో ఫుల్ సెక్యూరిటీ!

ABOUT THE AUTHOR

...view details