తెలంగాణ

telangana

Landslides on Indrakiladri Temple: ఇంద్రకీలాద్రిపై జారిపడుతున్న కొండచరియలు..శాశ్వత పరిష్కారం ఎప్పుడంటున్న భక్తులు

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 9:52 AM IST

Updated : Sep 16, 2023, 12:47 PM IST

Landslides on Indrakiladri Temple ఆంధ్రప్రదేశ్​లో తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అత్యంత ప్రసిద్ధి గాంచిన బెజవాడ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై నుంచి రాళ్లు జారిపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేవీనవరాత్రులు సమీపిస్తున్న వేళ రాళ్లు జారిపడుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది. నిపుణుల కమిటీ సూచనలు చేసినా శాశ్వత ప్రాతిపదికన దేవస్థానం అధికారులు పనులు చేపట్టలేకపోతున్నారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టేస్తున్నారు.

Frequent_Landslides_on_Indrakiladri
Landslides on Indrakiladri Temple ఇంద్రకీలాద్రిపై జారిపడుతున్న కొండచరియలు..

Landslides on Indrakiladri Temple: ఇంద్రకీలాద్రిపై జారిపడుతున్న కొండచరియలు..శాశ్వత పరిష్కారం ఎప్పుడంటున్న భక్తులు

Landslides on Indrakiladri Temple :ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై చిన్నపాటి వర్షానికే కొండపై నుంచి ఆలయం సమీపంలోకి రాళ్లు జారిపడుతున్నాయి. చాలాసార్లు ఘాట్‌రోడ్డు మార్గంలో రాళ్లు జారిపడ్డాయి. రెండేళ్ల క్రితం దసరా ఉత్సవాలు జరుగుతుండగా.. వేలాది మంది భక్తులు కొండపై ఉన్న సమయంలో భారీ రాళ్లు జారిపడ్డాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. తరచూ వానలు పడినప్పుడు చిన్న చిన్న రాళ్లు పడుతూనే ఉన్నాయి. ఘాట్‌రోడ్డులో భక్తులు పైకి వచ్చే మారంలోనూ చాలాసార్లు కొండ చరియలు విరిగిపడ్డాయి.

Landslides at Vijayawada kanaka Durga Temple :రాళ్లు జారి పడకుండా అధికారులు తాత్కాలిక చర్యలే తీసుకుంటున్నారు. తప్ప శాశ్వత పరిష్కారం ఆలోచించడం లేదు. కొండపై అంతటా ఒకేరకమైన రాళ్లు లేవు. కొన్నిచోట్ల వదులుగా, మరికొన్నిచోట్ల గట్టిగా ఉన్నాయి. అన్నింటికీ కలిపి ఒకేరకమైన సాంకేతికత పనిచేయదు. రాయిని బట్టి కిందకు జారి పడకుండా ఉండేందుకు ఏం చేయాలనేది నిర్ణయించాలి. చాలాచోట్ల మట్టి మాదిరిగా వదులుగా ఉండే రాళ్లుంటాయి. ఇక్కడ కెనెటింగ్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రమాదం పొంచి ఉందని తెలిసినా నిర్లక్ష్యం వీడరా..?

చిన్న రాళ్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో చైన్‌ లింక్‌ మెష్‌ వేసి..క్రాంక్‌లు బిగిస్తారు. ఇటీవల అందుబాటులోనికి వచ్చిన సాంకేతికతతో సెన్సార్లను ఏర్పాటు చేయొచ్చు. ఎక్కడైనా ప్రమాదం ఉందని తెలిస్తే వెంటనే అలారం మోగుతుంది. కొండపై ఎక్కడెక్కడ ఎలాంటి రాళ్లున్నాయి, వాటి పరిస్థితి ఏంటనేది నిపుణుల బృందం పలుమార్లు అధ్యయనం చేసింది. ఐఐటీ చెన్నై, ఐఐటీ కాన్పూర్‌ , బెంగళూరులోని ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌, జీఎస్‌ఐకు చెందిన నిపుణుల బృందం గతేడాది ఇంద్రకీలాద్రికి వచ్చి పరిశీలించారు. వారి నివేదిక ఆధారంగా తాత్కాలిక ప్రాతిపదికగా చర్యలు చేపట్టారు. కానీ పరిస్థితిలో పూర్తిగా మార్పు లేదు.

EO Vs Chairman: అనిశాతో ఉలిక్కిపడ్డ ఇంద్రకీలాద్రి.. ఈవోపై పాలక మండలి ఛైర్మన్‌ ఆగ్రహం

ఇంద్రకీలాద్రిపై కొండరాళ్ల ముప్పు ఎన్నో ఏళ్లుగా ఉంది. రాళ్లు జారిపడకుండా 2008లో ఆరు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి పాక్షికంగా ఇనుప వల వేశారు. కానీ.. పెద్ద రాళ్లు పడినప్పుడు వల సైతం ఆపలేకపోతోంది. చాలాచోట్ల ఇప్పటికే వల పాడైపోయింది. తాజాగా కొండ దిగువన ప్రధాన రహదారిమీదకే కొండచరియలు విరిగి పడుతున్నాయి. సాంకేతిక బృందం సూచనలతో దేవస్థానం అధికారులు తాత్కాలిక పనులను యుద్ధప్రాతిపదికగా చేపట్టారు.ఇంద్రకీలాద్రిపై నుంచి రాళ్లు జారిపడకుండా తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారని శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


"వర్షాల ప్రభావం వల్ల కొండచరియలు జారిన కూడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం."- కర్నాటి రాంబాబు, దుర్గగుడి ఛైర్మన్‌

"మొన్న కొండచరియలు జారి పడటం జరిగింది. ఇంకా కొండచరియలు జారి పడే అవకాశం ఉందిని నిపుణులు చెప్పడం జరిగింది. వారి సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కొండ చరియలు విరిగి పడతాయని అనుమానం ఉన్న చోట ముందుగానే వాటిని తొలగిస్తున్నాం."- భ్రమరాంబ, దుర్గగుడి ఈఓ

Durga Temple Ghat Road Closed: జారిపడుతున్న కొండచరియలు.. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత

Last Updated : Sep 16, 2023, 12:47 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details