తెలంగాణ

telangana

Coronavirus kerala: కేరళలో మరో 32వేల కరోనా కేసులు

By

Published : Sep 1, 2021, 7:08 PM IST

Updated : Sep 1, 2021, 10:22 PM IST

కేరళలో కొత్తగా 32,803 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 18.76గా ఉంది. రాష్ట్రంలో వైరస్​ తీవ్రత మరో పది రోజుల్లో తగ్గుముఖం పడుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

kerala covid cases, కేరళలో కరోనా కేసులు
కేరళలో 32వేలకుపైగా కరోనా కేసులు

కేరళలో మరోసారి భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 32,803 మందికి కరోనా సోకింది. 21,610 మంది కోలుకోగా.. 173 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 18.76 శాతంగా నమోదైంది.

పది రోజుల్లో తగ్గుముఖం!

కేరళలో కొవిడ్​ కేసులు (coronavirus kerala) మరో పది రోజుల్లో తగ్గుముఖం పడతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. ఇటీవల వచ్చిన పండుగల కారణంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 24 శాతం పెరిగిందని తెలిపింది. 60 ఏళ్లు పైబడిన వారిలో అధిక శాతం మందికి టీకా పంపిణీ జరిగినందున వైరస్​ వ్యాప్తి తీవ్రం కాకుండా కట్టడి చేయవచ్చని పేర్కొంది.

ప్రస్తుతం రాష్ట్రంలో వారాంతపు లాక్​డౌన్, నైట్​ కర్ఫ్యూలు అమలులో ఉన్నాయి.

  • దేశంలో కరోనా టీకాల పంపిణీ సంఖ్య 66 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు..

  • మహారాష్ట్రలో కొత్తగా 4,456 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 4,430 మంది కోలుకోగా.. 183 మంది వైరస్​కు బలయ్యారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,159 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,112 మంది వైరస్​ను జయించగా.. 21 మృతిచెందారు.
  • తమిళనాడులో కొత్తగా 1509 కరోనా కేసులు బయటపడ్డాయి. 1719 మంది కోలుకోగా.. 20 మంది మృతిచెందారు.
  • ఒడిశాలో కొత్తగా 719 మందికి కరోనా సోకింది. వీరిలో 125 మంది పిల్లలు ఉన్నారు. మహమ్మారి ధాటికి 53 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి :ఇంధన ధరలపై మోదీ సర్కారుకు రాహుల్ చురకలు

Last Updated : Sep 1, 2021, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details