తెలంగాణ

telangana

కేరళలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు

By

Published : Aug 24, 2021, 10:50 PM IST

కేరళలో కరోనా(Corona cases) ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 24 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరో వైపు మహారాష్ట్రలో ఒక్కరోజే 4వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదవగా.. తమిళనాడులో 1,585 మందికి వైరస్​ సోకింది.

Kerala cases
కేరళ కరోనా కేసులు

కేరళలో కరోనా (Corona cases) విజృంభణ కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 24,296 కేసులు నమోదయ్యాయి. మరో 19,349 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 173 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 38.51 లక్షలకు చేరింది.

మహారాష్ట్రలో కొత్తగా 4,355 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 119 మంది చనిపోగా.. కొత్తగా 4,240 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

దేశ రాజధాని దిల్లీలో.. 39 మందికి వైరస్​ సోకింది. అక్కడ మృతుల సంఖ్య 0.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • తమిళనాడులో 1,585 మంది మహమ్మారి బారినపడ్డారు. 1,842 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,259 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,701 మంది కోలుకోగా.. 29 మంది మృతిచెందారు.
  • ఒడిశాలో కొత్తగా 629 మందికి కరోనా సోకగా.. 67 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జమ్ముకశ్మీర్​లో 125, గోవాలో 136, నాగాలాండ్​లో 47, గుజరాత్​లో​ 14, ఉత్తర్​ప్రదేశ్​లో 28, మధ్యప్రదేశ్​లో 5 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి.

టీకా పంపిణీ ఇలా..

దేశవ్యాప్తంగా 59.47 కోట్ల మందికి వ్యాక్సిన్​ వేసినట్లు కేంద్రం తెలిపింది. ఒక్కరోజులోనే 54 లక్షలకు మందికి పైగా టీకా తీసుకున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్ల జారీపై కేంద్రం కీలక నిర్ణయం!

ABOUT THE AUTHOR

...view details