తెలంగాణ

telangana

పిల్లలకు విషమిచ్చి.. ఉరేసుకున్న తండ్రి!

By

Published : Mar 17, 2021, 8:23 PM IST

తండ్రి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేరళలో జరిగింది. భార్యతో గొడవల కారణంగా కూతురు, కొడుక్కి విషమిచ్చిన భర్త.. తానూ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

Father and His Children Found Dead In Kasargod
పిల్లలకు విషమిచ్చి.. ఉరేసుకున్న తండ్రి.!

కేరళలోని కాసరగోడ్​లో విషాద ఘటన జరిగింది. తొలుత ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన రూగేశ్​.. ఆ తర్వాత తాను కూడా నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రూగేశ్​, శివానందన్​, వైదేహి (ఫైల్​)

కుటుంబ కలహాలే కారణమా?

రూగేశ్​, సబితలు భార్యాభర్తలు. వీరు చెరువతూర్​లో నివాసముంటున్నారు. వీరి మధ్య కొద్దికాలంగా తరచూ గొడవలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్యను వదిలేసి వేరుగా నివాసముంటున్నాడు రూగేశ్​. వీరి పిల్లలు వైదేహి(10), శివానందన్​(6) సబిత వద్దే ఉండేవారు. అయితే.. వారం క్రితం ఆ పిల్లలను తన వద్దకు తెచ్చుకున్నాడని సమాచారం.

ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:ఆశ్రమ పాఠశాలలో 30 మంది విద్యార్థులకు కరోనా

ABOUT THE AUTHOR

...view details