తెలంగాణ

telangana

Karnataka Gruha Lakshmi Scheme : 'ఎన్​డీఏ సర్కార్​ బిలియనీర్ల కోసమే.. మేము పేదల పక్షం'

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 4:21 PM IST

Updated : Aug 30, 2023, 4:39 PM IST

Karnataka Gruha Lakshmi Scheme : కర్ణాటక ప్రభుత్వం.. 'గృహ లక్ష్మి' పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం కింద కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.2 వేలు అకౌంట్​లో పడతాయి. మైసూర్​లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్​.. మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎన్​డీఏ సర్కార్​.. బిలియనీర్ల కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్​ ప్రభుత్వం​ పేదల కోసం పనిచేస్తుందని అన్నారు.

karnataka gruha lakshmi scheme
karnataka gruha lakshmi scheme

Karnataka Gruha Lakshmi Scheme :శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం అందించే 'గృహ లక్ష్మి' పథకాన్ని బుధవారం ప్రారంభించింది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం. దాదాపు 1.1 కోట్ల మంది మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద లబ్ది పొందనున్నారు. మైసూరులోని మహారాజాలో కాలేజీ గ్రౌండ్​లో 'గృహ లక్ష్మి' పథకాన్ని ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ పాల్గొన్నారు.

'ఎన్​డీఏ సర్కార్ బిలియనీర్ల కోసమే'
Rahul Gandhi On BJP :ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ సర్కార్​పై మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్​డీఏ సర్కార్​ బిలియనీర్ల కోసం మాత్రమే పనిచేస్తుందని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని అన్నారు. కర్ణాటకలో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన కీలక వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీనిలబెట్టుకుందని రాహుల్ తెలిపారు.

'మేము వాగ్దాలకు కట్టుబడి ఉన్నాం. ఎప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేయం. కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు కేవలం పథకాలు మాత్రమే కాదు. అవి పాలనా నమూనాలు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్ణాటకలో 600 కి.మీ నడిచాను. వేల మంది మహిళలతో మాట్లాడాను. నాకు అప్పుడు అర్థమైంది. ద్రవ్యోల్బణం కారణంగా పేదలు ఇబ్బంది పడుతున్నారని.' అని రాహుల్ తెలిపారు.

'రూ.17,500 కోట్లు కేటాయించాం'
కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీల్లో ఇప్పటికే మూడు నెరవేర్చిందని అన్నారు సీఎం సిద్ధరామయ్య. ఇప్పుడు 'గృహ లక్ష్మి' పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 'గృహలక్ష్మి' పథకానికి ప్రభుత్వం రూ.17,500 కోట్లు కేటాయించిందని చెప్పారు. నిరుద్యోగ పట్టభద్రులకు రూ.3 వేలు.. 2022-23లో పాసై.. నిరుద్యోగులుగా ఉన్న డిప్లొమా విద్యార్థులకు రూ.1,500.. ఇచ్చే పథకాన్ని 'యువ నిధి' పథకాన్ని 2023 డిసెంబరు లేదా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభిస్తామని తెలిపారు.

Karnataka Congress 5 Promises : 'గృహ లక్ష్మి' పథకం కింద కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2,000 అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. అర్హులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూన్​ 15న ఆన్​లైన్ దరఖాస్తు ప్రారంభమై.. జూలై 15న ముగుస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొన్నాళ్ల క్రితం చెప్పారు. దరఖాస్తు సమయంలో లబ్ధిదారులు తమ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డీబీటీ(డెరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్​ఫర్) ద్వారా నగదును మహిళా ఖాతాల్లోకి బదిలీ చేశారు.

'ఫ్రీ బస్' పథకంతో ప్రభుత్వంపై పెను భారం.. ఒక్క రోజు బిల్ ఎంతో తెలుసా?

ఉచిత హామీల అమలుకు కర్ణాటక కేబినెట్ గ్రీన్​ సిగ్నల్​.. రాష్ట్రంపై భారం ఎంతంటే?

Last Updated : Aug 30, 2023, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details