తెలంగాణ

telangana

Pawan Kalyan Met Amit Shah: కేంద్ర హోం మంత్రితో పవన్​ భేటీ.. కీలక ట్వీట్​ చేసిన జనసేనాని, అమిత్​ షా..!

By

Published : Jul 20, 2023, 9:05 AM IST

Janasena Chief Pawan Met Amit Shah: రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో బీజేపీ పెద్దలను జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ కలవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుమారు 25నిమిషాల భేటీ అనంతరం పవన్​ కల్యాణ్​, అమిత్​ షా ట్వీట్​లు చేశారు.

Pawan Kalyan Met Amit Shah
Pawan Kalyan Met Amit Shah

Janasena Chief Pawan Met Amit Shah: కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్‌ షాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఆ పార్టీ PAC ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ దిల్లీలో భేటీ అయ్యారు. హోంశాఖ కార్యాలయంలో వీరి మధ్య సుమారు 25 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఎన్డీఏ సమావేశానికి హాజరైన పవన్​.. దిల్లీలోనే ఉండి బీజేపీకి సంబంధించిన పలువురు నేతలను కలిశారు. ఏపీలో ఎన్నికల వాతావరణం ఇప్పటికే వచ్చేసినందున ఇరు పార్టీలూ కలిసి దానికి సమాయత్తం కావాలని.. అమిత్‌షా పవన్‌ కల్యాణ్‌తో అన్నట్టు తెలుస్తోంది. పొత్తుల విధి విధానాలపైనా ప్రాథమికంగా చర్చ జరిగింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితుల గురించి అమిత్‌షా దృష్టికి పవన్‌ తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

Pawan Met Amit Shah in Delhi: ఏపీలో ప్రతిపక్షాల రాజకీయ సభలు, సమావేశాలు జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్న తీరు, సామాన్యులపై జరుగుతున్న దాడుల గురించి వివరించినట్టు తెలిసింది. అమిత్‌షాతో సమావేశం అద్భుతంగా జరిగినట్టు ..తమ చర్చలు ఏపీ ప్రజల ప్రగతికి దోహదం చేస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక సుసంపన్నమైన భవిష్యత్‌ అందించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని భేటీ తర్వాత పవన్‌ ట్వీట్ చేశారు. అలాగే జనసేన అధినేతతో సమావేశం అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్​ షా కూడా ట్వీట్​ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, ఆ రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి జనసేన ‍అధ్యక్షుడి ఆలోచనలు పంచుకున్నట్టు ట్విట్టర్​లో తెలిపారు. హోం మంత్రి అమిత్​ షా ను కలవడానికి ముందు.. మురళీధరన్​తో పవన్​ కల్యాణ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్​లో బీజేపీ, జనసేన కూటమి బలోపేతంపై చర్చించామని మురళీధరన్‌ ట్వీట్‌ చేశారు. పవన్‌, మనోహర్‌కు ఆతిథ్యం ఇవ్వటం ఆనందంగా ఉందని ఆయన ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

Pawan Comments on Alliances: రాష్ట్రంలో మరో కొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏ పార్టీ వారికి అనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ రూట్​ మార్చి వైఎస్సార్​సీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రెండో దశ వారాహి యాత్రతో ప్రభుత్వానికి అండగా ఉన్న వాలంటీర్​ వ్యవస్థపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అంశం రాష్ట్రంలో తీవ్ర దుమారాన్నే సృష్టించింది. దీనిపై విపక్షాలు అన్ని ఓ తాటిపైకి వచ్చి వాలంటీర్​ వ్యవస్థను రద్దు చేయాలనే తమ డిమాండ్లను వినిపించారు. మరోవైపు పవన్ కల్యాణ్‌ దిల్లీ పర్యటన అంటే వెంటనే గుర్తొచ్చేది.. పొత్తులు. ఇప్పటికే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన.. ఇందులోకి తెలుగుదేశం పార్టీని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుందని సమాచారం.

ఏపీలో వైఎస్సార్​సీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే తన అభిమతమని.. దానికి అందరు కలిసి పోరాడాలని ఎప్పుడు ఈ విషయంపై చర్చ వచ్చిన పవన్​ చెప్పే మొదటి మాట. అలాగే రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చన్న ఆయన కామెంట్‌ కూడా వైరల్​ అవుతోంది. అలాగే పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్​ అవుతున్నాయి. పవన్​తో ప్రత్యక్షంగా భేటీ అవుతానని.. ఇప్పటికే ఫోన్​లో టచ్​లో ఉన్నట్లు కామెంట్లు చేశారు. అయితే దిల్లీ పర్యటన అనంతరం ఏపీకి వచ్చాక పవన్​ ఏం చేయబోతున్నారు.. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ABOUT THE AUTHOR

...view details