తెలంగాణ

telangana

ఎన్​కౌంటర్​లో ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతం

By

Published : Jul 8, 2021, 11:15 PM IST

జమ్ముకశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47 రైఫిల్స్​తో పాటు.. పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలకు చెందిన ఇద్దరు జవాన్లు కూడా అమరులయ్యారు.

encounter
ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​లోని రాజౌరీ జిల్లా దాదల్ అటవీ ప్రాంతంలోని సుందర్​బని సెక్టార్​లో ఇద్దరు పాకిస్థానీ చొరబాటుదారులను ఎన్​కౌంటర్ చేశాయి భద్రతా దళాలు. ముష్కరులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులైనట్లు రక్షణ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. నాయబ్ శ్రీజిత్ ఎం, సిపాయి మరుపోలు జశ్వంత్ రెడ్డి ప్రాణాలు విడిచినట్లు తెలిపారు.

ఉగ్రవాదుల చొరబాట్లు, సంచారానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు విస్తృత తనిఖీలు చేపట్టింది సైన్యం. ఈ క్రమంలో.. దాదల్ అటవీ ప్రాంతంలో ముష్కరులు కాల్పులు మొదలుపెట్టి.. హ్యాండ్ గ్రెనేడ్​లను విసిరారని ఓ అధికారి తెలిపారు.

నియంత్రణ రేఖ సరిహద్దు గ్రామమైన దాదల్​లో అనుమానిత ఉగ్రవాద ముఠాలు ఉన్నట్లు సైన్యానికి సమాచారం అందింది. ప్రస్తుతం ఆపరేషన్​ కొనసాగుతున్నట్లు తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details