తెలంగాణ

telangana

బస్సులో భారీగా మంటలు.. నలుగురు యాత్రికులు మృతి

By

Published : May 13, 2022, 8:29 PM IST

Jammu kashmir bus fire: జమ్ము కశ్మీర్​లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సుకు మంటలు అంటుకొని నలుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి గాయాలయ్యాయి.

J&K: A bus caught fire in Katra
J&K: A bus caught fire in Katra

బస్సులో మంటలు

kashmir bus fire accident: జమ్ముకశ్మీర్ రేసీ జిల్లా కట్రా ప్రాంతంలో బస్సుకు మంటలు అంటుకొని నలుగురు యాత్రికులు సజీవ దహనం అయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. కట్రా నుంచి జమ్ము వెళుతుండగా నొమాయ్‌ వద్ద బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

మంటల్లో కాలిపోతున్న బస్సు
కాలిపోయిన బస్సు

వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్రికులకు కట్రా వద్ద బేస్‌ క్యాంపు ఉంటుంది. బాధితులంతా వైష్ణో దేవిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎండ వేడి కారణంగా బస్సు ఆయిల్‌ ట్యాంకర్‌ వద్ద పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, బాంబు పేలుడు జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నట్లు వివరించారు.

బస్సును పరిశీలిస్తున్న అధికారులు
.
ఆస్పత్రిలో క్షతగాత్రులు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details