తెలంగాణ

telangana

మిద్దెపై అడవిని సృష్టించిన ప్రకృతి ప్రేమికుడు!

By

Published : Jun 5, 2021, 5:04 PM IST

మధ్యప్రదేశ్​ జబల్​పుర్​కు చెందిన ఓ వ్యక్తి.. తన ఇంటి మిద్దెపైనే అడవిని సృష్టించాడు. 40 జాతులకు చెందిన 2,500 బోన్సాయ్​ మొక్కలను పెంచాడు. ఈ మొక్కలు పర్యావరణానికి మేలు చేయటమే కాకుండా మంచి గాలిని కూడా అందిస్తాయని చెబుతున్నారాయన.

mini forest on terrace
మిద్దెపై 2,500 బోన్సాయ్​ చెట్లు

మిద్దపై ద్వివేది పెంచిన బోన్సాయ్​ మొక్కలు

మొక్కలు.. తోడుగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్​పెట్టవచ్చు. కానీ, కాంక్రీటు జంగళ్లు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పట్టణాల్లో పచ్చదనం ఊసే కనుమరుగవుతోంది. మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తాను నివసించే భవనంపైనే చిన్న పాటి అడవిని తీసుకువచ్చాడు. పదులు, వందలు కాదు ఏకంగా 40 జాతులకు చెందిన 2,500 బోన్సాయ్​ మొక్కలను తన ఇంటి మిద్దెపై పెంచాడు.

​ ద్వివేదీ ఇంట్లో బోన్సాయ్​ వనం
సోహన్​ లాల్​ ద్వివేది

మధ్యప్రదేశ్​ విద్యుత్​ శాఖలో ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన సోహన్​ లాల్​ ద్వివేది ఈ మిద్దెవనం సృష్టికర్త. ముంబయిలో ఓ మహిళ తన ఇంట్లో 250 బోన్సాయ్​ మొక్కలను పెంచిందనే వార్త విని తాను మొక్కల పెంపకాన్ని ప్రారంభించానని చెప్పారాయన.

"దాదాపు 40 ఏళ్ల క్రితం.. వార్తాపత్రికలో ముంబయిలో ఓ మహిళ 250 బోన్సాయ్​ మొక్కలను పెంచిందనే కథనాన్ని చదివాను. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మొక్కల పెంపకాన్ని ప్రారంభించిన నేను ప్రస్తుతం మా ఇంట్లో 2,500 మొక్కలను పెంచాను."

-సోహన్​ లాల్​ ద్వివేది.

సంపాదనంతా..

సోహన్​ లాల్​ ద్వివేదీ ఇంట్లో బోన్సాయ్​ చెట్లు

బోన్సాయ్​ మొక్కలంటే పెద్దగా ఉండే చెట్లకు చిన్ని ప్రతిరూపాలు. వీటికి అరుదుగా పండ్లు కూడా కాస్తుంటాయి. ఇంటికి అందాన్ని తీసుకువచ్చేందుకు వీటిని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. అయితే.. ద్వివేది ఇంటికి వెళితే మాత్రం మనకు యాపిల్, కమలం, రావి, జామ, దానిమ్మ, పనస, చింత చెట్లు సహా మొత్తం 40 జాతులకు చెందిన బోన్సాయ్​ మొక్కలు దర్శనమిస్తాయి.

"నేను మధ్యప్రదేశ్​ విద్యుత్​ శాఖలో పనిచేసేవాడిని. నా సంపాదనంతా ఈ మొక్కల పెంపకం కోసమే ఖర్చు చేశాను. మొక్కలు, ప్రకృతి నుంచి మనుషులు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రం నేను అందరిలా కాకుండా నా ఇంటిపైన ఉన్న ఈ చెట్ల మధ్యే ఎక్కువ సేపు గడిపాను."

-సోహన్​ లాల్​ ద్వివేది.

లాక్​డౌన్​ సమయంలో తనకు మొక్కల పెంపకంపై ఉన్న ప్రేమ మరింత పెరిగిందని ద్వివేది చెప్పారు. 'గతేడాది మొత్తం నేను ఈ మొక్కల మధ్యే గడిపాను. దాంతో నాకసలు లాక్​డౌన్​ ఉన్నట్లు కూడా అనిపించలేదు. ఈ మొక్కలు పర్యవరణానికి ఎంతో మేలు చేస్తాయి. చక్కటి గాలినందిస్తాయి' అని అన్నారు ద్వివేది.

ఇదీ చూడండి:Viral​: ఆకు లోపల పక్షి గూడు

ఇదీ చూడండి:నెమలి పురివిప్పగా.. మనసు పులకరించగా!

ABOUT THE AUTHOR

...view details