తెలంగాణ

telangana

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. 1,225 మందికి వైరస్​..

By

Published : Mar 31, 2022, 9:11 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కొత్తగా 1,225 మంది వైరస్ బారినపడ్డారు. మరో 28 మంది వైరస్​తో మరణించారు.

india corona cases
ఇండియా కరోనా కేసులు

Covid Cases India: దేశంలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కొత్తగా 1,225 మందికి వైరస్​ సోకింది. 28 మంది వైరస్​తో మరణించారు. 1,594 మంది వైరస్​ను జయించారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. బుధవారం మరో 22,27,307 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,84,06,55,005 కు పెరిగింది.

  • మొత్తం కేసులు:4,30,24,440‬
  • మొత్తం మరణాలు:5,21,129
  • యాక్టివ్​ కేసులు:14,307
  • కోలుకున్నవారు:4,24,89,004

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటే:ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం అన్ని దేశాల్లో కలిపి మరో 15,73,443 కొత్త కేసులు వెలుగుచూశాయి. 4,239 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 48,66,79,873కు చేరగా.. మృతుల సంఖ్య 61,61,746కు పెరిగింది. కరోనా ప్రభావం దక్షిణ కొరియాలో అత్యధికంగా ఉంది. అక్కడ కొత్తగా 4,24,528 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య కోటి దాటింది.

దేశం కొత్త కేసులు కొత్త మరణాలు మొత్తం కేసులు మొత్తం మరణాలు
1 దక్షిణ కొరియా 4,24,528 432 1,27,74,956 15,855
2 వియత్నాం 85,765 41 94,72,254 42,454
3 జర్మనీ 2,67,367 305 2,09,70,297 1,29,742
4 ఫ్రాన్స్​ 1,69,024 149 2,54,45,532 1,42,134
5 ఇటలీ 77,621 170 1,45,67,990 1,59,224

ABOUT THE AUTHOR

...view details