తెలంగాణ

telangana

ఫ్రెండ్స్​తో​ సెక్స్​ చేయాలని భర్త బలవంతం

By

Published : May 18, 2022, 8:23 PM IST

Husband Forces Wife: తన ఇద్దరు స్నేహితులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని భార్యను బలవంతం చేశాడు ఓ భర్త. అంతే కాదు, తన కళ్ల ముందే సెక్స్​లో పాల్గొనాలని ఒత్తిడి కూడా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్త, ఇద్దరు స్నేహితులపై కేసు నమోదైంది. ఉత్తర్​ప్రదేశ్​లో తలనొప్పి నయం చేస్తామని నమ్మించి 26 ఏళ్ల మహిళపై ఆమె బంధువుతో పాటు క్షుద్ర పూజలు జరిపే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు.

usband asks his wifr to share physical relations with his friends
usband asks his wifr to share physical relations with his friends

Husband Forces Wife:మహారాష్ట్రపుణెలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భారతీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాంతంలో నివాసముంటున్న ఓ వ్యక్తి తన భార్యను తీవ్ర ఇబ్బందులు పెట్టాడు. తన ఇద్దరు స్నేహితులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని భార్యపై ఒత్తిడి చేశాడు. అంతే కాకుండా తన కళ్లెదుటే సెక్స్​లో పాల్గొనాలని కూడా వేధించాడు. వాటిని తట్టుకోలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్తతో పాటు అతడి ఇద్దరు స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

తలనొప్పి నయం చేస్తామంటూ..ఉత్తర్​ ప్రదేశ్​లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తలనొప్పి నయం చేస్తానని నమ్మించి 26 ఏళ్ల మహిళపై ఆమె బంధువుతో పాటు క్షుద్ర పూజలు జరిపే వ్యక్తి కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మే 13వ తేదీ రాత్రి మౌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు మంగళవారం.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని, రెండో నిందితుడిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం పంపినట్లు చెప్పారు.

అత్యాచారం కేసులో అరెస్టైన పోలీసు..ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో 18 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై కానిస్టేబుల్‌తోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. నిందితులను ఫరూఖాబాద్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ లఖండ్రా, అతడి స్నేహితుడు అమిత్‌గా గుర్తించారు. వీరిద్దరూ బాధితురాలి గ్రామానికి చెందిన వారని తెలిపారు.

ఏప్రిల్ 20న నిందితులు బాధితురాలిని ఓ మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అయితే, ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినట్లు ఆమె తెలుసుకుని, తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పిందని పోలీసులు తెలిపారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇద్దరు నిందితులను మంగళవారం ఫరూఖాబాద్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

లాడ్జిలో విగతజీవులుగా..మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా అలీబాగ్ పట్టణంలోని ఓ లాడ్జిలో నలుగురు వ్యక్తులు విగతజీవులుగా కనిపించారు. పుణె నగరానికి సమీపంలో ఉన్న షిక్రాపుర్​లో ఉంటున్న ప్రియంక ఇంగలే, కునాల్​ గైక్వాడ్​ కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. మే 11న వీరంతా అలీబాగ్​లోని లాడ్జికి వచ్చారు. అయితే మంగళవారం చాలా సేపు వరకు గది నుంచి ఎవరూ బయటకు రావట్లేదని యజమాని తలుపులు బద్దలుకొట్టించగా.. ఫ్యాన్​కు ఉరి వేసుకుని కనిపించారని అధికారి తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాలను అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని అధికారి తెలిపారు. ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

హైకోర్టును ఆశ్రయించిన మైనర్​..జోధ్​పుర్​ క్లబ్‌లోని వాష్‌రూమ్‌ ఉండగా.. ఓ వ్యక్తి తనను రహస్యంగా వీడియో తీశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓ మైనర్ బాలిక రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించింది. నిందితుడితో దర్యాప్తు అధికారికి వ్యక్తిగత సంబంధాలు ఉన్న కారణంగా పోలీసులు ఈ ఫిర్యాదును సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదనే కారణంతో హైకోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.

ఏమైందంటే.. బాధితురాలు ఏప్రిల్ 24న తన స్నేహితురాలితో జోధ్​పుర్​లోని క్లబ్​కు వెళ్లింది. స్విమ్మింగ్​ చేసిన తర్వాత వాష్‌రూమ్‌లో బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఎవరో రహస్యంగా చిత్రీకరించడాన్ని ఆమె గమనించింది. ఆ తర్వాత ఆమె అలారం బటన్​ ప్రెస్​ చేసింది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా పట్టుబడ్డాడు. బాధితురాలి తల్లి అక్కడికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇవీ చదవండి:కడుపులో 7 కేజీల కొకైన్​.. విలువ రూ. 7 కోట్లకుపైనే- బ్యాగుల్లో వన్యప్రాణుల స్మగ్లింగ్​

దిల్లీ రాజకీయాల్లో ట్విస్ట్.. లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా

ABOUT THE AUTHOR

...view details