తెలంగాణ

telangana

Husband attacked wife At JubileeHills : భార్యపై అనుమానం.. బీర్​సీసాతో దాడి చేసిన భర్త.. చివరికి ఏమైందంటే

By

Published : Jul 19, 2023, 7:48 PM IST

Husband attacked wife with beer bottle : అందమైన జీవితాలు మద్యం మత్తులో తూలుతున్నాయి. దాంపత్య జీవితాలు వివాహేతర సంబంధాలతో నలిగిపోతున్నాయి. భార్యభర్తల మధ్య ఏర్పడిన పవిత్ర బంధంలో అనుమానం అనే చిన్న వైరస్​.. వృద్ధి చెంది ప్రాణాంతక వ్యాధిలా వ్యాప్తి చెందుతోంది. దీంతో పచ్చని కాపురాలు సర్వనాశనం అవుతున్నాయి. హైదరాబాద్​లోని ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్​లో జరిగిన ఈ ఘటనే ఇందుకు నిదర్శనం.

Husband attacked wife At JubileeHills
Husband attacked wife At JubileeHills

Husband attacked wife On Extramarital affairs : అనుమానమే పెను భూతంగా మారింది. మద్యం మత్తు ఆయన్ను కటాకటాల్లోకి నెట్టింది. హాయిగా వెళ్లిపోతున్న ఆలుమగల జీవితాల్లో అనుమానం అనే చిన్న వైరస్​ వ్యాప్తి చెంది ప్రాణాంతక వ్యాధిలా మారుతోంది. జూబ్లీహిల్స్​లో ఇవాళ జరిగిన ఉదాంతమే ఇందుకు నిదర్శనం. భార్యపై అనుమానంతో మద్యం మత్తులో ఓ భర్త.. ఆమెపై దాడికి తెగబడ్డాడు. దీంతో హాయిగా వెళ్లాల్సిన ఆలుమగల జీవితాలు.. భార్య ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతుంటే.. భర్త పోలీసుల అదుపులో ఉన్నారు.

పోలీసుల అదుపులో భర్త ఆనంద్​

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్​ రోడ్​ నెంబర్​ 36లో దారుణం చోటు చేసుకుంది. పెద్దమ్మ గుడి బస్​స్టాప్ వద్ద బస్సు​ కోసం ఎదురు చుస్తోన్న ఓ మహిళను తన భర్తే మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడు. బీర్​ బాటిల్​తో అతి కిరాతకంగా పోడిచాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అతన్ని అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తీవ్ర గాయాలపాలైన ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Husband attacked his wife At Husband : దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాకు చెందిన ఆనంద్‌.. నవీనాను 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ గత కొంత కాలంగా భా‌ర్యభర్తల మధ్య గొడవలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు.

ఆనంద్‌ ఇద్దరు పిల్లలతో కలిసి ఉప్పల్‌లో ఉండగా.. అతని భార్య నవీన మాదాపూర్​లోని ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తోంది. అయితే ఇవాళ ఉదయం 8.30గంటల సమయంలో ఆఫీస్​కు వెళ్తున్న నవీనపై.. ఆనంద్‌ మద్యం మత్తులో బీరు బాటిలోతో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్​ను అదుపులోకి తీసుకున్నారు.

ఒంటరైపోతున్న పిల్లలు:భార్యభర్తల మధ్య తలెత్తిన చిన్నచిన్న వివాదాలు చినికి చినికి గాలి వానల మారి జీవితాలను ఆగం చేస్తున్నాయి. చాలా కేసుల్లో భార్య.. భర్తను హత్య చేయడం.. భర్త.. భార్యను హత్య చేయడం జరుగుతోంది. వారిలో ఒకరు లోకాన్ని విడిచి పోతుంటే.. మరొకరు జైలు జీవితం అనుభవించాల్సి వస్తోంది. మరి వారి ప్రేమకు గుర్తుగా పుట్టిన బిడ్డలు వీధిన పడాల్సిన పరిస్థితి వస్తోంది. చాలా కేసుల్లో ఇలాంటి ఘటనలే చూస్తున్నాం. అమ్మ ప్రేమ పొందలేక.. నాన్న ఆప్యాయతను నోచుకోక పిల్లలు పక్కదారి పడుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details