తెలంగాణ

telangana

500 ఏళ్లనాటి ఆలయంలో బయటపడ్డ బంగారం

By

Published : Dec 13, 2020, 4:34 PM IST

ఓ పురాతన ఆలయ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా భారీగా బంగారం లభ్యమైంది. వాటిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.

gold found under Centuries old temple
500 ఏళ్లనాటి ఆలయంలో బయటపడ్డ బంగారం

500 ఏళ్లనాటి ఆలయంలో బయటపడ్డ బంగారం

తమిళనాడులోని ఓ పురాతన ఆలయ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా.. భారీగా బంగారం బయటపడింది. ఈ సంఘటన కాంచీపురం జిల్లా ఉత్తీరమీరుర్​​లో జరిగింది.

కులంబేశ్వర ఆలయం

గ్రామంలో రెండో కులోతుంగ చోళ కాలానికి చెందిన ఓ పురాతన కులంబేశ్వర ఆలయం ఉంది. దేవాలయ ఉత్సవ కమిటీ ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందుకోసం.. దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న నల్లరాతి మెట్లను తొలగింపు పనులు చేపట్టింది. పనులు జరుగుతుండగా.. వారికి వస్త్రంతో చుట్టిన ఓ మూట కనిపించింది. ఆ మూటను విప్పి చూస్తే.. బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి.

బంగారు నగలు మూట లభ్యమైన స్థలం
మూటలో బయటపడ్డ బంగారు ఆభరణాలు
బంగారంతో గ్రామస్థులు

అయితే.. తమ అనుమతి లేకుండా 500 ఏళ్లనాటి ఆలయ భాగాల్ని పడగొట్టారనే విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు.. గ్రామానికి చేరుకున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు.

800 గ్రాముల పసిడిని తాము స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. తాము చేరుకోకముందే.. బంగారాన్ని స్థానికులు తమ ఇళ్లకు తీసుకువెళ్లారని చెప్పారు.

బయట బంగారం బరువును కొలుస్తున్న అధికారులు
అధికారులతో గ్రామస్థుల వాగ్వాదం

ఈ బంగారు ఆభరణాలు.. 16 వ శతాబ్దంలో పాలించిన నాయకుల కాలానికి చెందినవిగా తెలుస్తోంది. దుండగుల భయంతో దేవుని విగ్రహానికి అలంకరించిన ఈ నగలను భూమిలో పాతి పెట్టి ఉంటారని భావిస్తున్నారు.

ఇదీ చూడండి:ఇక్కడ టీ తాగితే కప్ తినాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details