తెలంగాణ

telangana

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

By

Published : Sep 26, 2022, 6:28 AM IST

Horoscope Today: ఈ రోజు(సెప్టెంబరు 26) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

Horoscope Today
Horoscope Today

Horoscope Today: ఈ రోజు(సెప్టెంబరు 26) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

శుభకాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం మంచిది.

మీ మీ రంగాల్లో మిశ్రమంగా ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమవాతావరణం ఉంటుంది. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి సరైన ఆహార నియమాలను పాటించాలి. ప్రసన్నాంజనేయ సోత్ర పారాయణ చేయాలి.

శుభఫలితాలున్నాయి. బుద్దిబలం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అష్టలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.

భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. దుర్గస్తుతిని పఠిస్తే బాగుంటుంది.

శరీర సౌఖ్యం కలదు. మనస్సు చెప్పింది చేయండి శుభం చేకూరుతుంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అపరిచితులతో జాగ్రత్త. దైవారాదన మానవద్దు.

మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. ఈశ్వర శ్లోకాలు చదవాలి.

ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. శని ధ్యానం శుభప్రదం

మొదలుపెట్టిన పనులలో ఆటంకాలను అధికమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.

మొదలు పెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. భోజన నియమాలను పాటించడం ఉత్తమం. దుష్టులకు దూరంగా ఉండటం మేలు. శ్రీవారి దర్శనం శుభాన్నిస్తుంది.

చేపట్టే పనిలో బద్దకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. లక్ష్మీఅష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

ABOUT THE AUTHOR

...view details