తెలంగాణ

telangana

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

By

Published : Sep 17, 2022, 6:21 AM IST

Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 17) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

Horoscope Today
రాశి ఫలం

Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 17) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు తొలగడానికి శ్రీరామరక్షా స్తోత్రం చదివితే మంచిది.

చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభఫలితాలుంటాయి.

కీలక వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయ సూచితం. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా నడుచుకోండి సత్ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచి ఫలితాలనిస్తుంది.

ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. దైవారాదన మానవద్దు.

అనుకున్న పనులు నెరవేరుతాయి. మనఃసౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. అర్థలాభం ఉంది. ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ముఖ్య పనుల్లో బద్దకాన్ని దరిచేరనీయకండి. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందగలుగుతారు.

అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. వేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం.

మనోభీష్టం నెరవేరుతుంది. మీ మీ రంగాల్లో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో సర్ధుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. దుర్గ ధ్యానం శుభప్రదం.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులవైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యంచేసుకోకపోవడమే మంచిది. శ్రీ లక్ష్మీగణపతి ధ్యానం మంచిది.

శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.

మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు. చిత్తశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details