తెలంగాణ

telangana

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

By

Published : Nov 29, 2022, 6:18 AM IST

Horoscope Today: ఈ రోజు(నవంబర్​​ 29) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today
horoscope today

Horoscope Today: ఈ రోజు(నవంబర్​​ 29) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.

మీ మీ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే బాగుంటుంది.

శుభకాలం. బుద్ధిబలాన్నే పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. దత్తాత్రేయ స్వామి సందర్శనం వల్ల మంచి జరుగుతుంది.

సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చు పెట్టాలి. సూర్యనారాయణమూర్తి ఆరాధన వల్ల మంచి జరుగుతుంది.

ధర్మసిద్ధి ఉంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్థలాభం కలదు. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దుర్గాస్తోత్రం చదవాలి.

అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయ పాలనతో పనులను పూర్తిచేస్తారు. శ్రీలక్ష్మీదేవి ఆలయ సందర్శనం శుభప్రదం.

మనఃసౌఖ్యం ఉంది. ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాల గురించి కాలాన్ని వృథా చేయకండి. మనఃశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది. మనఃసౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

శుభకాలం ఉంది. ప్రారంభించిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. వృత్తి,ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.

మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు చదివితే బాగుంటుంది.

శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి.

ABOUT THE AUTHOR

...view details