తెలంగాణ

telangana

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

By

Published : Nov 21, 2022, 6:11 AM IST

Horoscope Today: ఈ రోజు(నవంబర్​​ 21) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today
రాశి ఫలం

Horoscope Today: ఈ రోజు(నవంబర్​​ 21) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.

చేపట్టే పనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

అందరినీ కలుపుకు పోవడం అవసరం. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు పోరాదు. ఆంజనేయ సందర్శనం శుభప్రదం.

మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధారాస్తోత్రం చదివితే బాగుంటుంది.

అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్నిస్తాయి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. ద్వితీయంలో.. స్థానంలో చంద్ర బలం అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యలతో ఆనందాన్ని పంచుకుంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే అంతా మంచి జరుగుతుంది.

ఆటంకాల వల్ల శ్రమ అధికమవుతుంది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో జాగ్రత్త. బంధుమిత్రలుతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.

ఏపనిని మొదలుపెట్టినా సులువుగా పూర్తవుతుంది. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. సూర్య ఆరాధన శుభదాయకం.

పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికమవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు సహస్రనామం చదివితే మంచిది.

సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు అందుతాయి. కాలం ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. ఇష్టదైవ శ్లోకాన్ని చదివితే మేలు జరుగుతుంది

మిశ్రమకాలం. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరమవుతాయి. నవగ్రహ స్తోత్రం పఠించడం మంచిది.

తోటి వారితో కలిసి ఆనందంగా గడుపుతారు. శత్రుపీడ తగ్గుతుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details