తెలంగాణ

telangana

ఆ రాశివారు ఇవాళ ప్రయాణాలు వాయిదా వేయడం బెటర్​!

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 5:07 AM IST

Horoscope Today December 27th 2023 : డిసెంబర్​ 27న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 27 December 2023
Horoscope Today December 27th 2023

Horoscope Today December 27th 2023 : డిసెంబర్​ 27న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారి జీవితం మంచి మలుపు తిరుగుతుంది. మీ ఆలోచన వైఖరిలో మార్పు వస్తుంది. మంచి జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. ఇది భవిష్యత్​లో మీకు ఎంతో ఉపకరిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రోజంతా సంతోషంగా గడుస్తుంది.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారు కాస్త నిదానంగా ఉండాలి. గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చు. పనులన్నీ నెమ్మదించవచ్చు. కానీ ఇవాళ మీరు తొందరపడకూడదు. వీలైనంత వరకు రాజీ ధోరణి అవలంభించాలి. కానీ ఇవాళ కళాకారులకు, రచయితలకు బాగుంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభించకండి.

మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారికి మంచి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. కానీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కోవాలి. స్నేహితులు మీకు పూర్తి సహకారం అందిస్తారు.

కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారు మానసిక ఆందోళనకు గురవుతారు. సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారు. ఇది నిరాశకు దారి తీస్తుంది. వీలైనంత వరకు వాదనలకు, చర్చలకు దూరంగా ఉండాలి. ఆర్థిక నష్టాలు రావచ్చు. ఆనారోగ్య సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. స్నేహితులు మీకు చేదోడువాదోడుగా ఉంటారు. పనులు మాత్రం జాప్యం చేయకూడదు. లేకుంటే మంచి అవకాశాలు చేజారిపోతాయి.

కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారు కొత్త పనులు ప్రారంభిస్తే మంచిది. అవి కచ్చితంగా విజయవంతం అవుతాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధిత ప్రయోజనాలు లాభిస్తాయి. పనులన్నీ సునాాయాసంగా పూర్తవుతాయి.

తుల (Libra) :ఈ రోజు తుల రాశివారు వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. రచయితలకు, చిత్రకారులకు మంచి ఫలితాలు వస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. భవిష్యత్ కోసం మంచి ప్రణాళికలు రచిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అనవసర వాదనలకు దిగకూడదు.

వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కీలకమైన కొత్త పనులు, కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. నిగ్రహంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. కానీ ఆత్మబలంతో చేసే పనులు కచ్చితంగా విజయవంతం అవుతాయి.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారి తారాబలం బాగుంది. మీలోని సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. స్నేహితులు, బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపారులు, వృత్తి నిపుణులు, గృహిణులు అందరికీ మంచి జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.

కుంభం (Aquarius) :ఈ రోజు కుంభ రాశివారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకూడదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఈ రోజు మీరు మానసిక అశాంతికి, ఆందోళనకు గురికావచ్చు. మిమ్మల్ని రెచ్చగొట్టే వ్యక్తులను పట్టించుకోకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. కొన్ని ఘటనలు మిమ్మల్ని కలతకు గురిచేస్తాయి. అయినా శాంతం వహించండి. వాదనల్లోకి దిగకండి. వృత్తిపరంగా నష్టాలు రావచ్చు. దైవ ప్రార్థనతో సమస్యలు తొలగిపోతాయి.

ABOUT THE AUTHOR

...view details