తెలంగాణ

telangana

Horoscope Today (15-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

By

Published : Nov 15, 2021, 4:22 AM IST

ఈ రోజు రాశిఫలాలు(Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు

ఈరోజు(15-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం;శుక్లపక్షం

ఏకాదశి: ఉ. 8.33 తదుపరి ద్వాదశి

ఉత్తరాభాద్ర: రా. 8.27 తదుపరి రేవతి

వర్జ్యం: ఉ.శేష వర్జ్యం 7.17 వరకు

అమృత ఘడియలు: మ. 3.30 నుంచి 5.09 వరకు

దుర్ముహూర్తం: మ. 12.06 నుంచి 12.51 వరకు తిరిగి మ.2.21 నుంచి 3.06 వరకు

రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు

సూర్యోదయం: ఉ.6.08

సూర్యాస్తమయం: సా.5-21 చాతుర్మాస్య వ్రత సమాప్తి

మేషం

తోటివారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దలు ప్రశంసలు లభిస్తాయి. శరీరసౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

వృషభం

శుభకాలం. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. సమయాన్ని మంచి పనులకు ఉపయోగించండి. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. కుటుంబసభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

మిథునం

పట్టుదల వదలకండి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

కర్కాటకం

మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్రధ్యానం శుభప్రదం.

సింహం

ప్రయత్న కార్యానుకూలత ఉంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఈశ్వరారాధన సత్ఫలితాలను ఇస్తుంది.

కన్య

విందు వినోదాలతో కాలం గడుస్తుంది. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మీలోని ఉత్సాహాన్ని పెంచుతాయి. ఇష్టదైవ ఆలయ సందర్శనం మరింత శుభాన్ని చేకూరుస్తుంది.

తుల

చేపట్టిన కార్యాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మీ మీ రంగాల్లో నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి మంచి ఫలితాలు సొంతమవుతాయి. అతిగా ఎవ్వరినీ విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

వృశ్చికం

కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. సాయి చరిత్ర పారాయణ చేయడం మంచిది.

ధనుస్సు

సర్వత్రా విజయసిద్ధి కలదు. ఊహించిన దానికంటే గొప్ప ఫలితాలను పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త శక్తినిస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవ నామస్మరణ చేస్తే మంచిది.

మకరం

గ్రహబలం అనుకూలంగా లేదు. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరి చేరనీయకండి. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నవగ్రహ ధ్యానం మేలు జరుగుతుంది.

కుంభం

మనసుపెట్టి పనిచేస్తే విజయం మీదే. అభివృద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

మీనం

కార్యసిద్ధి ఉంది. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఇష్టదైవ ప్రార్థన చేయడం ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు.

ABOUT THE AUTHOR

...view details