తెలంగాణ

telangana

సోనియా గాంధీకి షాక్​.. రెండు ఎన్​జీఓల లైసెన్స్ రద్దు

By

Published : Oct 23, 2022, 11:29 AM IST

Updated : Oct 23, 2022, 11:51 AM IST

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి చెందిన రెండు ఎన్​జీఓలకు కేంద్రం షాక్ ఇచ్చింది. విదేశీ విరాళాల సేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆ రెండు ఎన్​జీల ఎఫ్​సీఆర్​ఏను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది.

sonia gandhi
sonia gandhi

విదేశీ విరాళాల సేకరణ విషయంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి చెందిన రెండు ఎన్​జీఓల ఎఫ్​​సీఆర్​ఏను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్‌జీసీటీ) చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. నిధుల దుర్వినియోగం, ఆదాయపు పన్ను దాఖలు చేసేటప్పుడు దస్త్రాలను వక్రీకరించడం చేయడం సహా, చైనా, విదేశాల నుంచి నిధులు పొందుతూ మనీలాండరింగ్​కు పాల్పడుతున్నాయని అధికారులు తెలిపారు.

హోం శాఖ లైసెన్సులు రద్దు చేసిన రెండు ఎన్​డీఓలకు సోనియాగాంధీ ఛైర్​పర్సన్​గా ఉన్నారు. ట్రస్టీలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నేత చిదంబరం, ప్రియాంక గాంధీ.. తదితరులు ఉన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్.. 1991లో ఏర్పాటైంది. అణగారిన వర్గాలు, గ్రామీణ పేదల అవసరాలను తీర్చేంచుకు రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్​ను 2002లో నెలకొల్పారు.

ఇవీ చదవండి: ప్రేమకు నో చెప్పిందని పగ.. ఇంటికెళ్లి దారుణంగా గొంతు కోసి హత్య

రెండేళ్ల చిన్నారి గొప్ప మనసు.. క్యాన్సర్ రోగుల కోసం జుట్టు దానం..

Last Updated :Oct 23, 2022, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details