తెలంగాణ

telangana

వర్ష బీభత్సం- స్తంభించిన రవాణా

By

Published : Jul 22, 2021, 11:47 AM IST

Updated : Jul 22, 2021, 12:46 PM IST

ముంబయి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతూనే ఉన్నాయి. వరదనీరు ఎక్కడికక్కడే నిలిచి.. రవాణా వ్యవస్థ స్తంభించింది. పలు ప్రాంతాల్లో లోకల్​ రైళ్లను సెంట్రల్​ రైల్వే రద్దు చేసింది. రానున్న 24 గంటల్లో ముంబయి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసింది.

rains in mumbai, maharashtra
ముంబయిలో వర్షాలు

ముంబయిలో వరదలు

మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కరుస్తున్న వర్షాలకు ముంబయి సహా పరిసర జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ముంబయిలో ఎక్కడికక్కడ నీరు నిలిచి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.

వానలతో వాహనదారుల ఇక్కట్లు
రోడ్లపై నిలిచిన వరదనీరు

పలు ప్రాంతాల్లో లోకల్‌ రైళ్లను సెంట్రల్‌ రైల్వే రద్దు చేసింది. ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌వే, గాంధీనగర్‌, వాడలా వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కింగ్‌ సర్కిల్‌లోని రైల‌్వే వంతెన వద్ద భారీ కంటెయినర్‌ నిలిచిపోగా.. పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది.

రైల్వే వంతెన వద్ద నిలిచిపోయిన భారీ కంటెయినర్​
కింగ్​ సర్కిల్​లో పెద్ద ఎత్తున నిలిచిన ట్రాఫిక్​ జామ్​
కింగ్​ సర్కిల్​లో ట్రాఫిక్​ జామ్​ దృశ్యాలు

వర్షాల కారణంగా ఇప్పటివరకు పలు ఘటనల్లో 33 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ముంబయితో పాటు పరిసర జిల్లాల్లోనూ వాన బీభత్సం కొనసాగుతుంది. ఠాణెలోని భివండీ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. దుకాణ సముదాయాల్లోకి పెద్దఎత్తున నీరు ప్రవేశించింది.

జనావాసాలను ముంచెత్తిన వరదనీరు
ఇళ్లను ముంచెత్తిన వరద నీరు

పాల్ఘర్​​, నాసిక్‌ జిల్లాల్లో వరదలు.. నదీ ప్రవాహాలను తలపిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ముంబయిలో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని బృహన్ ముంబయి కార్పొరేషన్​(బీఎంసీ).. ప్రజలకు సూచించింది.

ఇదీ చూడండి:వరుణుడి బీభత్సానికి మహా నగరాలు గజగజ

ఇదీ చూడండి:ముంచెత్తిన వరదలు- స్తంభించిన జనజీవనం

Last Updated : Jul 22, 2021, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details