తెలంగాణ

telangana

Hamoon Cyclone Update : తుపానుగా మారిన అల్పపీడనం.. ఆ రెండు రాష్ట్రాలపై ఎఫెక్ట్​.. ప్రభుత్వం అలర్ట్​!

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 10:49 AM IST

Updated : Oct 24, 2023, 11:22 AM IST

Hamoon Cyclone Update : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా, బంగాల్‌ రాష్ట్రాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

Latest Hamoon Cyclone In Bay Of Bengal
Hamoon Cyclone Update

Hamoon Cyclone Update : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దాదాపు 200 కిలోమీటర్ల దూరం నుంచి ఒడిశా రాష్ట్ర తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 21 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతుందని.. ఇది మరికొద్ది గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ బులెటిన్‌లో పేర్కొంది.

ఆ తర్వాత, ఈశాన్య దిశగా తుపాను కదులుతున్నప్పుడు క్రమంగా అల్పపీడనం బలహీనపడి.. మంగళవారం సాయంత్రం ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచించింది. ఈ తుపానుకు 'హమూన్‌' అని పేరు పెట్టారు. ఈ పేరును ఇరాన్‌ సూచించింది. అయితే ఈ తుపాను భారత తీరంపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని సోమవారం ఐఎండీ అంచనా వేసింది.

సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఒడిశాలోని పారాదీప్‌ తీరానికి 230 కిలోమీటర్లు, బంగాల్​లోని ధిగాకు దక్షిణంగా 240 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకు 280 కిలోమీటర్ల దూరంలో, నైరుతి దిశగా ఉన్న చిట్టగాంగ్‌కు 410 కి.మీల దూరంలో ఈ హమూన్​ తుపాను కేంద్రీకృతమైందని IMD తెలిపింది. ఈ అల్పపీడనం గత కొద్ది గంటల్లో గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలి తుపానుగా మారిందని అధికారులు పేర్కొన్నారు.

కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు..
రానున్న 12 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఈ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ సోమవారం రాత్రి పేర్కొంది. అక్టోబర్‌ 25న బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా, చిట్టగాంగ్‌ మధ్య బంగ్లా తీరం దాటే అవకాశం ఉందని.. అది తీవ్ర అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. తుపాను ప్రభావంతో ఒడిశాలో గత కొద్ది గంటల్లో దాదాపు 15 కి.మీల వర్షపాతం నమోదైంది. దీంతో మంగళవారం కోస్తాంధ్రలో సైతం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ప్రభుత్వం అలెర్ట్​..
Cyclone In Bay Of Bengal : హమూన్​ తుపాను కారణంగా రాబోయే రెండ్రోజుల్లో ఒడిశాలో గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది అక్కడి ప్రభుత్వం. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది. అలాగే భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి హుటాహుటిన ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

వేటకు వెళ్లవద్దు..
అయితే ఒడిశాపై నేరుగా ప్రభావం ఉండకపోయినా.. మత్స్యకారులు ఎవరూ రెండ్రోజుల వరకు చేపలు పట్టేందుకు సముద్రానికి వెళ్లవద్దని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు సూచించారు. మరోవైపు.. బంగాల్‌లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ విభాగం వెల్లడించింది.

Tamil Nadu Road Accident : బస్సును ఢీకొట్టిన టాటా సుమో.. ఏడుగురు భక్తులు దుర్మరణం.. దర్శనానికి వెళ్లి వస్తుండగా..

Tantrik Killed Woman : దెయ్యం వదిలిస్తానని చిత్రహింసలు.. మెడపై కాలేసి తొక్కిన తాంత్రికుడు.. స్పృహ కోల్పోయి మహిళ మృతి

Last Updated : Oct 24, 2023, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details