తెలంగాణ

telangana

Gujarat COVID-19 patient: 202 రోజులు కరోనాతో పోరాడిన మహిళ

By

Published : Nov 21, 2021, 7:06 AM IST

202 రోజులు కొవిడ్​తో (Gujarat Covid-19 patient) పోరాడి ఇంటికి చేరింది గుజరాత్​కు చెందిన ఓ మహిళ. మే1న కరోనాతో ఆస్పత్రిలో చేరగా.. పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి శుక్రవారం ఇంటికి చేరింది. దీంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

COVID-19
కరోనా

గుజరాత్​కు చెందిన ఓ మహిళ (Gujarat Covid-19 patient) ఏకంగా 202 రోజులు కొవిడ్​-19 మహమ్మారితో పోరాడి విజయం సాధించింది. ఆస్పత్రి నుంచి ఆమె శుక్రవారం డిశ్ఛార్జ్ అయి ఇంటికి చేరుకుంది. దీంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తంచేశారు.

ఏమైందంటే..?

గుజరాత్ దాహోద్​ నగరానికి చెందిన గీతా ధర్మిక్(45).. మే1న కరోనా బారిన పడింది. ఆమె భర్త రైల్వే ఉద్యోగి. దీంతో గీతాను దాహోద్​లోని రైల్వే ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను వెంటిలేటర్​పైనే ఉంచి వైద్యం అందించారు. 202 రోజుల పాటు మహమ్మారితో పోరాడింది గీత. చివరకు పూర్తిగా కోలుకుని శుక్రవారం ఇంటికి చేరింది. దీంతో గీతా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

ఏప్రిల్ 23న తన మామ గుండెపోటుతో చనిపోతే భోపాల్ వెళ్లామని.. అక్కడినుంచి వచ్చాక గీతకు కరోనా లక్షణాలు కనిపించాయని ఆమె భర్త త్రిలోక్ ధార్మిక్​ తెలిపారు. పరీక్ష చేయిస్తే.. పాజిటివ్​గా తేలిందన్నారు.

ఇదీ చూడండి:చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స చేసి బతికించిన వైద్యులు

ABOUT THE AUTHOR

...view details