తెలంగాణ

telangana

ప్రేమించాడని యువకుడిని కొట్టిచంపిన యువతి కుటుంబసభ్యులు

By

Published : Nov 18, 2021, 10:54 PM IST

గుజరాత్​లోని వడోదరా జిల్లాలో దారుణం జరిగింది. యువతిని ప్రేమించాడన్న కారణంతో ఓ యువకుడిని కొట్టి చంపారు ఆమె కుటుంబ సభ్యులు. నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

man beaten to death over love affair
ప్రేమించాడని యువకుడిని కొట్టిచంపిన యువతి కుటుంబసభ్యులు

యువతిని ప్రేమించాడన్న కారణంతో ఓ 20 ఏళ్ల యువకుడిని దారుణంగా కొట్టి చంపారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ ఘటన గుజరాత్​లోని వడోదరా జిల్లా చొకరీ గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై యువతి తండ్రి సహా మరో ముగ్గురుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు.

జయేశ్​ రావల్

ఇదీ జరిగింది..

చొకరీ గ్రామానికి చెందిన జయేశ్​ రావల్​ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ కలిసి తిరగడాన్ని గమనించిన యువతి తల్లి.. కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కుటుంబీకులు.. జయేశ్​ రావల్​పై దాడికి దిగారు. ఓ చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ క్రమంలో బాధితుడు స్పృహ కోల్పోయాడు.

యువకుడిపై దాడి చేస్తున్న యువతి కుటుంబసభ్యులు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.

ఇదీ చూడండి :కోపంతో కోడలి చెయ్యి నరికిన మామ... అతికించిన వైద్యులు

ABOUT THE AUTHOR

...view details